Shakila: బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన షకీలా ఎందుకు ఎలిమినేట్ అయిదంటే..? బిగ్ బాస్ హౌస్ నుంచి సినీ నటి షకీలా ఎలిమినేట్ అయింది. దాంతో హౌస్ మెట్స్ అందరూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే షకీలా హౌస్ లో అందరికీ తలలో నాలుకలా ఉండేది. ఎవరికి గొడవలు వచ్చినా సరే కలిపేందుకు ప్రయత్నించేది. అందుకే ఆమె అందరికీ ఫేవరెట్ కంటెస్టెంట్ గా నిలిచింది. హౌస్ మేట్స్ తో పాటు షకీలా కూడా భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. ఇలా హౌస్‍లోని ప్రతీ ఒక్కరు తమ బాధను వ్యక్తం చేయడం కాస్త ఇంట్రస్టింగ్‍గా అనిపించింది. By Jyoshna Sappogula 18 Sep 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Shakila: బిగ్ బాస్ 7 హౌస్ నుంచి సినీ నటి షకీలా ఎలిమినేట్ అయింది. దాంతో హౌస్ మెట్స్ అందరూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే షకీలా హౌస్ లో అందరికీ తలలో నాలుకలా ఉండేది. ఎవరికి గొడవలు వచ్చినా సరే కలిపేందుకు ప్రయత్నించేది. అందుకే ఆమె అందరికీ ఫేవరెట్ కంటెస్టెంట్ గా ఉంది. ఆమె వెళ్లిపోతుంటే అమర్ దీప్ ఏడ్చేశాడు. అటు టేస్టీ తేజ కూడా బాధపడ్డాడు. హౌస్ నుంచి షకీలీ ఎలిమినేట్ అయి బయటకు వస్తుండగా హౌస్ మేట్ దామిని ‘పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా’ అంటూ పాడగా హౌస్ మేట్స్ తో పాటు షకీలా కూడా భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. ఇలా హౌస్‍లోని ప్రతీ ఒక్కరు తమ బాధను వ్యక్తం చేయడం కాస్త ఇంట్రస్టింగ్‍గా అనిపించింది. అయితే, ఇంత త్వరగా తాను బయటకు వచ్చేస్తానని అనుకోలేదని షకీలా చెప్పారు. అయితే, ఎలిమినేట్ అయినందుకు తనకేం బాధగా లేదని ఆమె చెప్పారు. ఇంట్లో వాళ్లందరూ బాగుండాలని, బాగా ఆడాలని చెబుతూ వీడ్కోలు పలికారు. హౌస్ లో ఉన్నవారు ఎవరు ఎలాంటి వారని నాగార్జున అడగగా.. హౌస్ మేట్స్ ఫొటోలపై పెయింట్ వేస్తూ ఒక్కొక్కరి గురించి షకీలా వివరించారు. ప్రియాంక అందరితోనూ ఎప్పుడూ స్నేహంగా మెసలుకుంటుందని, తనకు తానే గొప్పవాడిగా ప్రిన్స్ యావర్ ఫీలవుతుంటాడని, పల్లవి ప్రశాంత్ ఆవేశపరుడని, దామిని నమ్మకస్తురాలని చెప్పారు. ఇక రతికా రోజ్ హృదయం బండరాయిలాంటిదని, ఇంట్లో వాళ్లందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి అని శివాజీని షకీలా మెచ్చుకున్నారు. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో షకీలా.. ఓ అరుదైన కంటెస్టెంట్. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరొకరితో గొడవ పెట్టుకుని బయటకు వచ్చిన వాళ్లే. ఆడియన్స్‌తోనే.. హౌస్‌లో ఉన్న వాళ్లతోనే ఛీ అనిపించుకున్న వాళ్లే. కానీ షకీలా అలా కాదు.. అటు ఆడియన్స్‌తోనూ.. ఇటు హౌస్ మేట్స్‌తోనే చిన్న గొడవ కూడా లేదు. చిన్న చిన్న డిస్కషన్స్ నడిచినా కూడా.. ఆమెతో ఎవరైతే విభేదించారో చివరికి వాళ్లే వచ్చి క్షమాపణ చెప్పిన పరిస్థితి చూశాం. ఇంటిలో ఉన్న యువ కంటెస్టెంట్ల జోరు తట్టుకోలేకపోవడం, రెండోది వయసు ఆమెకు అడ్డంకిగా మారడం వల్ల ఫిజికల్ టాస్క్‌లో వెనుకబడింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో బలమైన ఫాలోయింగ్ లేకపోవడంతో సరైన రీతిలో ఓట్లు సంపాదించకపోవడం వల్ల ఎలిమినేట్ కావాల్సి వచ్చింది అని తెలిసింది. ఆమె ఏం సినిమాలు చేసింది.. ఎవరితో చేసింది.. అవన్నీ గతం. ఇప్పుడు ఆమె హౌస్‌లో ఎలా ఉన్నదన్నదే ముఖ్యం. అందుకే ఆమె హౌస్‌లో ఉన్న వాళ్లందరికీ మాత్రమే కాదు.. అందరికీ అమ్మ అయ్యింది. షకీలాగా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన ఆమె.. ‘అమ్మ’గా తిరిగివచ్చింది. Also Read : హీరో నాగార్జున సోదరిపై పోలీసు కేసు..!! అసలు ఏం జరిగిందంటే..? #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి