'పుష్ప 2' లో ఛాన్స్.. ఆ కారణంతోనే వదిలేసుకున్నా : రవికృష్ణ

'పుష్ప 2' లో ఛాన్స్.. ఆ కారణంతోనే వదిలేసుకున్నా : రవికృష్ణ
New Update

Actor Ravi Krishna About Pushpa 2 Offer : గత ఏడాది సాయి తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమాలో సీరియల్ యాక్టర్ రవికృష్ణ నటన ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.. సినిమాలో చేతబడి చేసే క్యారెక్టర్ లో తన ఫెర్పార్మెన్స్ తో అందర్నీ భయపెట్టిన రవికృష్ణ.. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే ఆశిష్ రెడ్డి హీరోగా యాక్ట్ చేసిన 'లవ్ మీ' మూవీలో ఓ కీలక పాత్ర పోషించాడు. మే 25 న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా రవికృష్ణ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

Also Read : బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ .. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్!

'లవ్ మీ' సినిమా కోసం 'పుష్ప 2' అఫర్ వదులుకున్నా

లవ్ మీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రవికృష్ణ మాట్లాడుతూ.. " లవ్ మీ సినిమా చేస్తున్న సమయంలో నాకు పుష్ప 2 లో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ డేట్స్‌ క్లాష్‌ అవడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. అంత పెద్ద సినిమా మిస్‌ చేసుకున్నప్పటికీ ఈ మూవీ నాకొక మైల్‌ స్టోన్‌గా ఉండిపోతుందన్న నమ్మకముంది. నన్ను నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌" అని చెప్పుకొచ్చాడు.

దీంతో రవికృష్ణ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇతని కామెంట్స్ విన్న నెటిజన్స్ 'పుష్ప 2' లాంటి పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ రావడమే గొప్పా? అలాంటిది నువ్వు ఓ మీడియం రేంజ్ సినిమా కోసం పుష్ప 2 ఛాన్స్ ను ఎలా మిస్ చేసుకున్నావ్? అంటూ ప్రశ్నిస్తున్నారు.

#actor-ravikrishna #pushpa-2 #love-mee-trailer-launch-event
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe