Raj Tarun: హైకోర్టును ఆశ్రయించిన నటుడు రాజ్ తరుణ్..!

నటుడు రాజ్ తరుణ్ ముందస్తు బెయిలు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రాజ్ తరుణ్‌పై లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నార్సింగి పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

New Update
Raj Tarun: హైకోర్టును ఆశ్రయించిన నటుడు రాజ్ తరుణ్..!

Raj Tarun - Lavanya:  నటుడు రాజ్ తరుణ్ హై కోర్టును ఆశ్రయించారు. నార్సింగి పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రాజ్ తరుణ్. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారించిన తెలంగాణ హైకోర్టు.. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

Also Read: వయనాడ్‌లో కనీవిని ఎరుగని రీతిలో విధ్వంసం.. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే..!

రాజ్ తరుణ్ (Raj Tarun) – లావణ్య (Lavanya) ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో వివాదంగా మారిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని.. హీరోయిన్ మాల్వీతో రిలేషన్ లో ఉంటూ తనకు అన్యాయం చేస్తున్నాడని లావణ్య ఆరోపించింది. అయితే, రాజ్ తరుణ్ మాత్రం.. 'నేను లీగల్ గానే పోరాటం చేస్తాను. నేను లావణ్య కు వ్యతిరేకంగా వెళ్లడం లేదు. నేను ఆమె ఆరోపణలు చేసే వాటికి నేను లీగల్ గా వెల్లుతున్నాను'. అంటూ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు