Prakash Raj: నటుడు సిద్ధార్థ(Hero Siddharth )కు ప్రకాశ్‌రాజ్(Prakash Raj) కర్ణాటక ప్రజల తరపున సారీ చెప్పారు. సినిమా చిత్త (కన్నడంలో చిక్కు) ప్రచారం కోసం హీరో సిద్ధార్థ బెంగళూరు వచ్చారు. అయితే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడడం ప్రారంభించడానికి ముందే కన్నడ అనుకూల సంస్థల సభ్యులు ఆటంకం కలిగించారు. తన కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. అయితే, వారి నిరసన కొనసాగుతున్నా సరే సిద్ధార్థ మాట్లాడడం కొనసాగించడం ప్రారంభించాడు. తమ కావేరీ ఉద్యమానికి మద్దతు తెలపాలని ఆందోళనకారులు సిద్ధార్థను డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రక్తంగా మారింది. దీంతో సిద్ధార్థం చేతులు జోడించి తన ఫాన్స్ కు బై చెప్పి కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్పందించిన ప్రకాశ్‌రాజ్ సోషల్ మీడియా ద్వారా సిద్ధార్థకు క్షమాపణలు తెలిపారు.
కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ సమస్య దశాబ్దాలుగా ఉందని, ఇన్నేళ్ల కాలంలో సమస్యను పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలు, నాయకులను ప్రశ్నించలేదని, సమస్య పరిష్కారం కోసం కేంద్రం వద్ద ఒత్తిడి తీసుకురాలేని కుంటి ఎంపీలను ప్రశ్నించకుండా నిస్సహాయ సామాన్యులను, కళాకారులను చిత్రహింసలకు గురిచేయడం తప్పని, అందుకు కన్నడ ప్రజల తరపున సిద్ధార్థకు క్షమాపణలు అంటూ ప్రకాశ్‌రాజ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
నటుడు ప్రకాశ్ రాజ్, సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ మంచి స్నేహితులు. అంతే కాకుండా వీరు కలిసి చేసిన సినిమాలు సూపర్ హిట్ కూడా అయ్యాయి. ముఖ్యంగా టాలీవుడ్ తో పాటు ఇటు బాలీవుడ్‌లోనూ మోనార్క్ గా తన సత్తా చాటుకున్నారు ప్రకాశ్ రాజ్. పాత్ర ఎదైనా సరే ఇట్టే ఇమిడిపోతారు. ఇటీవల ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు ప్రకాశ్ రాజ్. అయితే, ఈ మధ్య పాలిటిక్స్ లో కాస్తా బిజీగా కనిపిస్తున్నారు.
Also Read: సలార్ రిలీజ్ డేట్ చెప్పేశారు…ఎక్స్ లో ట్రెండింగ్ లో సీజ్‌ఫైర్