True Lover Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న ట్రూ లవర్.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..?

మణికందన్, శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన చిత్రం ట్రూ లవర్. ఫిబ్రవరి 10న థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ వివరాల పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మార్చి 8 నుంచి డిస్నీహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానున్నట్లు టాక్.

New Update
True Lover Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న ట్రూ లవర్.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..?

True Lover Movie: డైరెక్టర్ ప్రభువ్యాస్ దర్శకత్వంలో తమిళ నటుడు మణికందన్, శ్రీ గౌరీప్రియ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఎమోషనల్ లవ్ డ్రామా 'ట్రూ లవర్'. తమిళ్ లో లవర్ పేరుతో వచ్చిన ఈ సినిమా తెలుగులో ట్రూ లవర్ గా విడుదల చేశారు. బేబీ నిర్మాత ఎస్‍కేఎన్, డైరెక్టర్ మారుతి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఫిబ్రవరి 10న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ .. కథలో కొత్తదనం లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. కానీ తమిళ్ లో మాత్రం డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తవకముందే.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వివరాల పై లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది.

ట్రూ లవర్ ఓటీటీ రిలీజ్

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక మార్చి 8 లేదా సెకండ్ వీక్ లో స్ట్రీమింగ్ కు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ థియేటర్స్ లో సినిమా లాంగ్ రన్ ఉంటే స్ట్రీమింగ్ డేట్ మారే ఛాన్స్ ఉందని టాక్. అలాగే ఈ సినిమా సాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది.

ఈ చిత్రంలో మ్యాడ్ మూవీ ఫేమ్ శ్రీ గౌరీప్రియ కథానాయికగా నటించింది. కన్నా రవి, హరీశ్, శరవణన్, హరిణి సుందరరాజన్, హరీశ్ నాగలక్ష్మి కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. సీన్ రొనాల్డన్ సంగీతం అందించగా .. శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.

publive-image

ట్రూ లవర్ స్టోరీ

ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే గొడవలు, మనస్పర్థలు, అనుమానాలతో కూడిన ఒక ఎమోషనల్ లవ్ స్టోరీనే ఈ ట్రూ లవర్ కథ. అరుణ్(మణికందన్ ), గౌరీప్రియ (దివ్య) ఇద్దరు కాలేజ్ డేస్ నుంచి ప్రేమించుకుంటారు. అయితే హీరోకు తన లవర్ దివ్య.. మరొకరితో మాట్లాడిన, కాస్త క్లోజ్ గా ఉన్న అస్సలు సహించలేడు. దీని వల్ల వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. అరుణ్ ప్రవర్తనతో విసిగిపోయిన దివ్య బ్రేక్ చెప్పాలని నిర్ణయించుకుంటుంది. అసలు వీళ్లిద్దరి ప్రేమ సక్సెస్ అయ్యిందా..? అరుణ్ లో మార్పు వచ్చిందా..? దివ్య ప్రేమను అరుణ్ అర్థం చేసుకున్నాడా అనేదే ఈ మూవీ కథ.

Also Read: Rashmika Mandanna: అరుదైన ఘనత సాధించిన రష్మిక.. ‘ఫోర్బ్స్ అండర్ 30’ లో చోటు

Advertisment
Advertisment
తాజా కథనాలు