"భద్రాచలం" మూవీ విలన్ కన్నుమూత.. విషాదంలో చిత్ర పరిశ్రమ

New Update

actor kazan khan passed away due to a heart attack 12022-23 సంవత్సరం అన్నీ చిత్ర పరిశ్రమలకు అంతగా కలిసి రావట్లేదనే చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ నుండి మాలీవుడ్ చిత్ర పరిశ్రమ వరకు వరుసగా హఠాన్మరణాలు సంభవిస్తున్నాయి. ఈ రెండు నెలల్లోనే అనేక మంది సినీ ప్రముఖులు కన్నుమూశారు. నటుడు శరత్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ రాజ్, ఆర్ఆర్ఆర్‍ విలన్ పాత్ర పోషించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్ సన్ వంటి నటులు ఇటీవలే తుది శ్వాస విడిచారు. కన్నడ నటుడు నితిన్ గోపీ, బాలీవుడ్‌లో ఆదిత్య సింగ్ రాజ్ పుత్, సీరియల్ నటి వైష్ణవి ఉపాధ్యాయ మరణించారు. మాలీవుడ్ నటుడు హరీష్ పెంగన్ అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు లేరన్న వార్త అటు టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్‌ ఇండస్ట్రీలను శోక సంద్రంలో ముంచేసింది.

ప్రముఖ నటుడు, విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నిన్నటి తరం ప్రముఖ నటుడు కజాన్ ఖాన్ గుండెపోటుతో సోమవారం (జూన్ 12) రాత్రి తుది శ్వాస విడిచారు. కజాన్ ఖాన్ సొంత రాష్ట్రం కేరళ. అందుకే మలయాళ భాషల్లోనే ఎక్కువగా సినిమాలు చేశాడు. కజన్‌ ఖాన్‌ మరణవార్త విషయాన్ని ప్రముఖ నిర్మాత, ప్రొడక్షన్ కంట్రోలర్ ఎన్ఎమ్ బాదుషా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కజాన్ ఖాన్ 1992లో సెంతమిళ్ పట్టు (తెలుగులో రాజశేఖర్‌ హీరోగా నటించిన అమ్మకొడుకు) అనే చిత్రం ద్వారా ఆయన ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేశారు. అయితే ఈ సినిమా తర్వాత కజన్‌ తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే తమిళ్‌, మలయాళంలో మాత్రం వరుసగా సినిమాలు చేశాడు. తెలుగు, కన్నడ, హిందీ పరిశ్రమల్లోనూ విలన్ పాత్రలను పోషించి పలు ప్రశంసలు అందుకున్నారు. టాలీవుడ్‌లో నటించింది కొన్ని చిత్రాలైన తన అద్భుత నటనతో విలన్ రోల్ పోషించి ఆడియెన్స్‌ని మెప్పించారు.

గంధర్వం, సీఐడీ ద మూస, ద కింగ్, వర‍్ణపకిత్, డ్రీమ్స్, మాయమోహిని, రాజాధిరాజా లాంటి మలయాళ సినిమాల్లో నటించారు. మొత్తంగా 50కి పైగా చిత్రాలు చేశారు. తెలుగులో పవన్ కల్యాణ్ బద్రీ చిత్రం, దివంగత శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం చిత్రాల్లో విలన్ గా నటించి తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. చివరగా 2015లో వచ్చిన 'లైలా ఓ లైలా' చిత్రంలో వెండి తెరపై కనిపించారు. కజాన్ ఖాన్ మరణం పట్ల తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు