Brahmaji: బీ కేర్‌ ఫుల్ అంటూ నటుడు బ్రహ్మాజీ స్ట్రాంగ్ వార్నింగ్..!!

ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరుతో ఓ వ్యక్తి కొత్త తరహా మోసానికి తెరలేపాడని నటుడు బ్రహ్మాజీ అందరిని అప్రమత్తం చేశారు. బీ కేర్‌ ఫుల్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరు అలర్ట్ అవుతున్నారు.

New Update
Brahmaji: బీ కేర్‌ ఫుల్ అంటూ నటుడు బ్రహ్మాజీ స్ట్రాంగ్ వార్నింగ్..!!

Brahmaji: ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరుతో ఓ వ్యక్తి కొత్త తరహా మోసానికి తెరలేపాడని నటుడు బ్రహ్మాజీ అందరిని అప్రమత్తం చేశారు. బీ కేర్‌ ఫుల్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరు అలర్ట్ అవుతున్నారు. ఓ వ్యకి తన పేరు నటరాజ్ అన్నాదురై అని , లోకేశ్ కనగరాజ్ కు మేనేజర్ నని ప్రచారం చేసుకుంటున్నాడని బ్రహ్మాజీ వెల్లడించారు. అతడు 78268 63455 నెంబరు నుంచి సినీ ఔత్సాహికుల కాల్ చేస్తున్నాడని తెలిపారు.

"లోకేశ్ కనగరాజ్ తదుపరి చిత్రానికి మీరు ఎంపికయ్యారు. కానీ కాస్ట్యూమ్స్ చాలా ప్రత్యేకమైనవి కావాల్సి ఉంటుంది. అందుకు మీరు డబ్బు ముందుగా చెల్లిస్తే కాస్ట్యూమ్స్ సిద్ధం చేస్తాం. ఆడిషన్ తర్వాత మీ డబ్బు మీకు తిరిగి చెల్లించడం జరుగుతుంది.." అంటూ ఆ వ్యక్తి నయా మోసానికి తెరలేపాడని బ్రహ్మాజీ వివరించారు.


అంతేకాదు, సత్యదేవ్ అనే మరో వ్యక్తి 'ఫోర్బ్స్ ఇండియా' జర్నలిస్టునంటూ వర్ధమాన నటీనటులను మోసం చేస్తున్నాడని కూడా బ్రహ్మాజీ వెల్లడించారు. సత్యదేవ్ 90877 87999 ఫోన్ నెంబరు ఉపయోగిస్తూ ఇప్పుడిప్పుడే పైకొస్తున్న నటులను లక్ష్యంగా చేసుకుంటున్నాడని వివరించారు. కొందరు నటీనటుల నుంచి దీనికి సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని బ్రహ్మాజీ సూచించారు.

Also Read: సంక్రాంతి బరిలోకి విక్టరీ వెంకటేష్ ‘సైంధ‌వ్‌’.. రిలీజ్ డేట్ ఫిక్స్

#NULL
Advertisment
తాజా కథనాలు