Atchannaidu: ఏపీలో దళితులపై దమనకాండ కేంద్రానికి కనిపించడంలేదా? రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దమనకాండ కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? అంటూ ధ్వజమెత్తారు టీడీపీ అచ్చెన్నాయుడు. టీడీపీ జాతీయ కార్యాలయంలో నేడు ‘దళితులంతా బాబుతోనే' పేరిట దళిత సమ్మేళన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. By Jyoshna Sappogula 06 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Atchannaidu: టీడీపీ జాతీయ కార్యాలయంలో నేడు ‘దళితులంతా బాబుతోనే' పేరిట దళిత సమ్మేళన సభ నిర్వహించారు. జగన్ రెడ్డి పాలనంతా దళితులపై ఊచకోత జరుగుతోందని, సీఎం జగన్ ఒకపక్క ఊచకోత సాగిస్తూ, మరోపక్క నాఎస్సీలు అనే జపం చేస్తున్నాడని ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ దళిత నేతలు మండిపడ్డారు. మరలా జగన్ ముఖ్యమంత్రి అయితే దళితులు రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితులు ఉంటాయని అన్నారు. Also Read: నీ క్రిమినల్ మైండ్ అర్థమవుతోంది.. పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి ఫైర్..! ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. “తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కడా చిన్న తప్పుచేయకుండా, నీతి నిజాయతీలే ఊపిరిగా, ప్రజాభిమానమే సంపదగా బతికిన చంద్రబాబునాయుడిపై తప్పుడు కేసు పెట్టి, 52 రోజుల పాటు అన్యాయంగా జైల్లో బంధించిన విషయం మనం ఎప్పటికీ మర్చిపోలేం. తెలుగుదేశం పార్టీ రాకముందు దళితులు.. బీసీలు.. మైనారిటీలను అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటుబ్యాంక్ గానే చూశాయి. స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించాకే.. దళిత, బీసీ, మైనారిటీ వర్గాలకు.. ముఖ్యంగా చెప్పాలంటే దళిత వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు లభించాయి. దళితుల్ని రాష్ట్రంలో, దేశంలో అగ్రస్థానంలో నిలపడానికి చంద్రబాబు ఎంతో ముందుచూపుతో వ్యవహరించారు. చంద్రబాబు దళితుల కోసం అమలు చేసిన 27పథకాలు రద్దు చేయడమేనా జగన్ దళితులకు చేసిన మంచి? జగన్ రెడ్డికి చెంచాలుగా పనిచేసే దళిత.. బీసీ, మైనారిటీ నాయకులు తప్ప రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్ పై కన్నీళ్లు పెట్టుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన గొప్పతనం ప్రజలకు అర్థమైంది. ఆయన్ని ప్రజలు ఎంతగా నమ్మారో చెప్పడానికి ఆయన జైలు నుంచి విడుదలైన రోజు సాగిన సుదీర్ఘ రోడ్డు ప్రయాణమే నిదర్శనం" అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, కేఎస్ జవహర్, ఉండవల్లి శ్రీదేవి, బాలవీరాంజనేయస్వామి, తంగిరాల సౌమ్య, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు తదితరులు హాజరయ్యారు. #acham-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి