Ananthapur: అనంతపురం జిల్లాలో ఏసీబీ వలకు ఓ అవినీతి తిమింగలం దొరికింది. వజ్రకరూరు ఎమ్మార్వో కార్యాలయంపై దాడి చేసిన అధికారులు ఎమ్మార్వో మహమ్మద్ రఫీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చాబాల గ్రామానికి చెందిన రైతు వెంకటేసులుకు 5.50 ఎకరాల భూమికి సంబంధించి మ్యూటేషన్ చేయడానికి ఎమ్మార్వో లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. రూ. 65 వేల నగదును ఫోన్ ద్వారా ఎమ్మార్వో మహమ్మద్ రఫీ తన బంధువుల అకౌంట్ కు వేయమని రైతును కోరాడు. రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ ప్రశాంతి ఎమ్మార్వోను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
AP: ఏసీబీ వలకు అవినీతి తిమింగలం..!
అనంతపురం జిల్లాలో ఏసీబీ వలకు ఓ అవినీతి తిమింగలం దొరికింది. వజ్రకరూరు ఎమ్మార్వో కార్యాలయంపై దాడి చేసిన అధికారులు ఎమ్మార్వో మహమ్మద్ రఫీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 5.50 ఎకరాల భూమికి సంబంధించి మ్యూటేషన్ చేయడానికి రైతు నుండి ఎమ్మార్వో రూ. లక్ష డిమాండ్ చేశారు.
New Update
Advertisment