Chandrababu Case: చంద్రబాబుకు జైలులో ఏసీ.. ఏసీబీ జడ్జి సంచలన ఆదేశాలు

చంద్రబాబు అనారోగ్యం విషయంలో ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు ఏసీ సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించింది. దీంతో చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయనున్నారు రాజమండ్రి జైలు అధికారులు.

New Update
AP Politics : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

జైలులో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు (ACB Court) ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు అనారోగ్యం విషయంలో ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టింది ఏసీబీ కోర్టు. విచారణకు జైళ్ల శాఖ డీజీ రవి కిరణ్, వైద్య బృందం హాజరైంది. చంద్ర బాబు పరిస్థితిపై జైళ్ల శాఖ అధికారులు, వైద్యులను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu Case: చంద్రబాబుకు జగన్ సర్కార్ మరో భారీ షాక్.. స్కిల్ డవలప్మెంట్ కేసు సీబీఐకి?

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కాకుండా మరేదైనా అనారోగ్య లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జైల్లో ఏసీ ఎప్పుడైనా ఏర్పాటు చేశారా? అని న్యాయమూర్తి అడిగారు. జైళ్లలో ఏసీ ఏర్పాటు చేసిన పరిస్థితులు ఎప్పుడు లేవని ఏసీబీ కోర్టుకు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. ప్రత్యేక పరిస్థితులల్లో కోర్టు ఆదేశాలు ఇస్తే ఏర్పాటు చేస్తామని కోర్టుకు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు.

చంద్రబాబు తరఫున సిద్ధార్థ లుద్రా వాదనలు వినిపిస్తూ.. మెడికల్ ఎగ్జామినేషన్ పరిగణలోకి తీసుకోవాలని కోరారు. జైల్లో చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైద్యులు కూడా చంద్రబాబు అనారోగ్యం బారిన పడుతున్నారని తేల్చినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని వివరించారు. దీంతో చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను జడ్జి ఆదేశించారు. దీంతో చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేయనున్నారు జైలు అధికారులు.
publive-image

ఇదిలా ఉంటే.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జైలు అధికారులు ఈ రోజు సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. రాజమండ్రి ఆస్పత్రి వైద్యుల బృందం ఆయనను పరీక్షించినట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు