Chandrababu Arrest Updates: సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డులను భద్రపరచాలంటూ చంద్రబాబు తరఫున న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సీఐడీ తరఫున వివేకానంద, చంద్రబాబు తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌లు తమ తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించి పిటీషన్‌ను కొట్టేసింది.
నంద్యాల పర్యటన సందర్భంగా చంద్రబాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే, ఈ కేసులో చంద్రబాబు అరెస్టైన డే 1 రోజునే.. సీఐడీ అధికారుల కాల్ డేటా భద్రపరచాలంటూ ఆయన తరఫున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా ఏసీబీ అధికారులు ఎవరెవరితో మాట్లాడారు? ఏం మాట్లాడారు? అనే వివరాలకు సంబంధించి ఏసీబీ అధికారుల కాల్ డేటాను స్వాధీనం చేసుకోవాలని కోరుతూ ఆయన తరఫు లాయర్లు కోర్టు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై అటు ఏసీబీ అధికారులు తమ వాదనలు తాము వినిపించారు. ఇది అధికారుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని, విచారణపై ప్రభావం చూపుతుందని కోర్టుకు వివరించారు. పలు దఫాలుగా ఈ కేసుపై విచారణ జరుగగా.. ఇవాళ ఈ పిటిషన్‌ను కొట్టేసింది న్యాయస్థానం.
Also Read:
శరీరంలో గాయం మచ్చ పోవట్లేదా? జస్ట్ ఇలా చేస్తే చాలు మరక మాయం..!
ఈ రాశుల వారు వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టాలు తప్పవు..!