Hyderabad: ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కైన బంజారాహిల్స్ సీఐ.. నెక్ట్స్ ఏం జరిగిందంటే..

ఏసీబీ అధికారుల వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది.. రక్షక భటుడే.. భక్షకుడు అయ్యాడు.. బెదిరింపులకు పాల్పడి అక్రమ వసూళ్లు, లంచాలకు ఎగమరిగిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్.. ఏసీబీ(ACB Officials) అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. పబ్బులను బెదిరిస్తూ.. లంచాలు దండుకుంటున్న సీఐ(CI) తోపాటు ఓ ఎస్సై, హోం గార్డ్ పై కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Hyderabad: ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కైన బంజారాహిల్స్ సీఐ.. నెక్ట్స్ ఏం జరిగిందంటే..

Hyderabad: ఏసీబీ అధికారుల వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది.. రక్షక భటుడే.. భక్షకుడు అయ్యాడు.. బెదిరింపులకు పాల్పడి అక్రమ వసూళ్లు, లంచాలకు ఎగమరిగిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్.. ఏసీబీ(ACB Officials) అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. పబ్బులను బెదిరిస్తూ.. లంచాలు దండుకుంటున్న సీఐ(CI) తోపాటు ఓ ఎస్సై, హోం గార్డ్ పై కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు పెట్టాలంటే లంచం.. కేసు నుంచి తప్పించాలంటే లంచం..! ఎఫ్ఐఆర్‌లో పేరు పెట్టాలన్నా లంచం.. FIR లో పేరు లేకుండా చేయాలంటే లంచం.. కుదిరితే భేరసారాలు.. కాదంటే బెదిరింపులు. పబ్బుల నుంచి వసూళ్లు! బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ళు.. కాదేదీ వసూళ్లకు అడ్డు. ఇవి చాలదన్నట్టు.. ల్యాండ్ సెటిల్మెంట్లు, సివిల్ పంచాయితీలు. ఇదీ.. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ తీరు. అడ్డగోలుగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇన్స్పెక్టర్ ఆటకట్టించారు ఏసీబీ అధికారులు.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ అంటేనే పబ్ లకు కేరాఫ్ అడ్రస్. పబ్బుల గబ్బు అంతా ఇంతా కాదు. నైట్ అయిందంటే చాలు.. న్యూసెన్స్. ఇలాంటి పబ్బుల బరతం పట్టాల్సిన పోలీసులు.. పబ్బులకు వత్తాసు పలుకుతున్నారు. వారి ఆగడాలకు అండ గా నిలుస్తున్నారు. కారణం.. నెలనెలా అందుతున్న మామూళ్లు. ఒక వేళ వాళ్ళు ఇవ్వకపోయినా స్టేషన్ నుంచి బెదిరింపులు, బలవంతపు వసూళ్లు. ఇదే తరహాలో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ బాగోతం తాజాగా బయటపడింది. లంచం వసూలు చేస్తూ.. ఏసీబీ అధికారులకు అడ్డంగా పట్టుబడ్డాడు.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లోని స్కై లాంజ్ పబ్ ఓనర్ ని బెదిరింపులకు గురిచేసి.. 4.5 లక్షలు డిమాండ్ చేశాడు బంజారాహిల్స్ సీఐ నరేందర్. మొత్తానికి 3 లక్షలకు బేరం కుదిరింది. అడ్వాన్స్ గా 50 వేల రూపాయలు తీసుకున్నాడు సీఐ నరేందర్. మరో రెండున్నర లక్షల కోసం.. పబ్ ఓనర్ ని వేధించసాగాడు సీఐ. ఇతనితో పాటు హోం గార్డ్ హరి సైతం డీల్ చేసిన తనకు 10 వేలు కావాలని వేధించాడని బాధితులు ఏసీబి కి ఫిర్యాదు చేసారు.

పబ్ ముందు రక్షక్ వెహికిల్ ని ఉంచి సైరన్ మోగించడం, అకారణంగా పబ్ ని క్లోజ్ చేయించడం.. పబ్ సిబ్బందిని రక్షక్ వెహికిల్ లో ఎక్కించుకుని పీఎస్ కి తీసుకురావడం వంటి వేధింపులకు గురి చేసాడు సీఐ నరేందర్. సీఐకి తోడుగా అడ్మిన్ ఎస్ఐ నవీన్ రెడ్డి కూడా డబ్బుల కోసం వేధించాడు. హోమ్ గార్డ్ హరి కూడా .. తనకు 10 వేల రూపాయలు ఇవ్వాలని పబ్ ఓనర్ ని డిమాండ్ చేశాడు. దీంతో.. పబ్ ఓనర్ రాజేశ్వర లక్ష్మణ రావు ఏసీబీ ని ఆశ్రయించాడు. 50 వేల రూపాయలు ఇచ్చే సమయంలో సీఐకి తెలియకుండా తీసిన వీడియో ని ఏసీబీ అధికారులకు చేరవేశాడు పబ్ ఓనర్.

పక్కా సమాచారంతో.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకున్న ఏసీబీ అధికారులు.. సీఐ నరేందర్ ని విచారించారు. సీఐ తోపాటు.. సీఐ నవీన్ రెడ్డి, హోం గార్డ్ హరి లను విచారించారు.. విచారణ సమయం లో మధ్యలో ఇన్స్పెక్టర్ అస్వస్థతకు గురి కావడంతో ఇన్స్పెక్టర్ నరేందర్ ను హుటాహుటిన ఏసిబి అధికారులు సిటీ న్యూరో హాస్పిటల్ తరలించి చికిత్స అందించారు. తిరిగి మళ్లీ పిఎస్ కు తరలించారు. ఏక్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

బంజారాహిల్స్ సీఐ నరేందర్ పై చాలా ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సివిల్ తాగదాల్లోనూ తలదూర్చి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బంజారాహిల్స్ పరిధిలోని పబ్బులు, స్పాలలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు సీఐ నరేందర్ పై ఆరోపణలు ఉన్నాయి.. ఏసీబీ కేసు చేయటంతో శాఖాపరమైన చర్యలు తప్పవనే వాదన వినిపిస్తుంది.

Also Read:

ఆ బాధ నీకెందుకయ్యా రేవంతు.. ఎంపీ అరవింద్ మాస్ కామెంట్స్..

కాంగ్రెస్‌ సంచలన హామీ..పెళ్లి సమయంలో ఆడపిల్లలకు తులం బంగారం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు