రాజకీయాల్లోకి అభిషేక్ బచ్చన్.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ?

సినిమాలు, రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఎంతో మంది సినిమా స్టార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పనిచేశారు. మరికొంతమంది అయితే పార్టీలు పెట్టి సీఎంలు కూడా అయ్యారు. తాజాగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ నుంచి అభిషేక్ బచ్చన్ రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

New Update
రాజకీయాల్లోకి అభిషేక్ బచ్చన్.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ?

publive-image

ఎంపీగా బరిలో దింపేందుకు ప్రయత్నాలు?

అమితాబ్ ఫ్యామిలీ ఇప్పటికే రాజకీయాల్లో ఉంది. జయాబచ్చన్ ప్రస్తుతం సమాజ్‌వాద్ పార్టీ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. అమితాబ్ కూడా 1984లో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం బిగ్ బీ కుమారుడు అభిషేక్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ నుంచి సమాజ్‌వాది పార్టీ తరపున పార్లమెంట్‌కు పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ పెద్దలు కొందరు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

publive-image

సినీ గ్లామర్ కలిసొస్తుందనే భావన..

తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగింపుగా అభిషేక్‌ను కూడా రాజకీయాల్లోకి దింపాలని ఎస్పీ అధిష్టానం మంతనాలు జరుపుతుందట. అయితే ఎంపీగా పోటీ చేసే అంశంపై అభిషేక్‌ ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తోంది. కానీ ఎస్పీ పెద్దలు మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎంపీగా నిలబెట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. అభిషేక్ పోటీ చేస్తే సినిమా గ్లామర్‌తో పాటు తల్లిదండ్రుల పొలిటికల్ బ్యాగ్రౌండ్‌ తమకు కలిసివస్తుందని భావిస్తున్నారని సమాచారం. గత రెండు పర్యాయాలు సమాజ్‌వాది పార్టీ యూపీలో అధికారానికి దూరంగా ఉంది. అలాగే పార్లమెంట్ స్థానాలను కూడా పెద్దమొత్తంలో కోల్పోయింది. దీంతో ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు పార్లమెంట్‌లో కూడా తమ బలం తిరిగి పుంజుకోవాలని ఆశిస్తోంది.

మోదీని ఢీకొట్టేందుకు స్టార్లకు గాలం?

దేశంలోనే ఎక్కువ లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ట్రంగా యూపీ నిలిచింది. ఆ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తే ఆ పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉండటం జరుగుతుంది. గత రెండు ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలో కొనసాగుతుంది. అంతకుముందు కాంగ్రెస్, సమాజ్‌వాద్ పార్టీలు ఎక్కువ సీట్లు గెలుచుకుని సెంట్రల్ పవర్‌లో ఉండేవి. ఈసారి కూడా అలాగే ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుని అధికారం చేపట్టాలని భావిస్తున్నాయి. ఇప్పటికే మోదీ హవాను ఢీకొట్టడానికి ప్రతిపక్షాలన్ని ఐక్యంగా ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. 2024లో ఢిల్లీలో చక్రం తిప్పడానికి అన్ని అవకాశాలను విపక్షాలు వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సినీ స్టార్లకు కూడా గాలం వేస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు