TS Schemes : మీకు బైక్ ఉందా? అయితే ఆ స్కీం కట్..మీరు ఆ లిస్టులో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి.!

తెలంగాణలో పథకాల సందడి నెలకొంది. అసలైన అర్హులకే పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టూవీలర్, కారు ఉంటే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హులుగా పరిగణించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఖరీదైన ఉపకరణాలున్నాయా వంటి వివరాలను కూడా ఆరా తీస్తున్నారు.

New Update
Telangana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

TS Schemes :  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తోంది. అందులో కీలకమైన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, రూ. 10లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బిమా పథకాలను ప్రారంభించారు. మరో రెండు రోజుల్లో ఇంకో రెండు పథకాలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 27వ తేదీన రూ. 500 ఎల్పీజీ సిలిండర్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీంలను కూడా అమలు చేయనున్నారు. ఈ స్కీంలను ప్రియాంకగాంధీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మిగతా స్కీంలపై కూడా చర్చజరుగుతోంది.

అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ పథకానికి దాదాపు 8లక్షలకుపైగానే మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ స్కీం కింద ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని తెలంగాణ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి 3,500చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో 4లక్షలకు పైగా నిర్మించనున్నట్లు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో సర్కార్ ప్రకటించింది. బడ్జెట్లో దీనికి 7వేల 740 కోట్లు కేటాయించింది.ఈనేపథ్యంలో లబ్దిదారుల సంఖ్యను తగ్గించేందుకు సర్కార్ కొత్త షరతులు పెట్టినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణలో పథకాల సందడి నెలకొంది. అసలైన అర్హులకే పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టూవీలర్, కారు ఉంటే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హులుగా పరిగణించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎంత కరెంట్ వినియోగిస్తున్నారు..ఏసీ, వాషింగ్ మెషీన్ వంటి ఖరీదైన ఉపకరణాలున్నాయా వంటి వివరాలను కూడా ఆరా తీస్తున్నారు.అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాలి.

ఇది కూడా చదవండి: విరాట్ సెన్సేషన్…ఆ ఘనత అందుకున్న తొలిభారతీయుడిగా రికార్డు క్రియేట్.!

Advertisment
తాజా కథనాలు