Aam Aadmi Party: సీఎంను, పార్టీని లేకుండా చేయాలని బీజేపీ కుట్ర.. ఆప్ సంచలన ఆరోపణలు

బీజేపీ కుట్రలో భాగంగానే లిక్కర్ స్కాం కేసులో ఈడీ తమ పార్టీ పేరును ఛార్జిషీట్ లో పేర్కొందని ఆప్ ఆరోపించింది. ఆప్ పార్టీని, పార్టీకి సంబంధించిన ముఖ్యనేతలను అణిచివేయాలని బీజేపీ చూస్తుందని తెలిపింది. ఈడీ బీజేపీలో ఒక భాగమని చురకలు అంటించింది.

New Update
Aam Aadmi Party: సీఎంను, పార్టీని లేకుండా చేయాలని బీజేపీ కుట్ర.. ఆప్ సంచలన ఆరోపణలు

Aam Aadmi Party: ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ పార్టీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఘాటుగా స్పందించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై విమర్శల దాడికి దిగింది. ఈడీ అనేది బీజేపీ రాజకీయ విభాగంలో ఒక భాగం అని ఆరోపించింది. రాజకీయ కుట్రలో భాగంగానే ఆప్ ని లిక్కర్ పాలసీ కేసులో ఇరికించారని ఫైర్ అయింది.

“ఈడీ బీజేపీకి రాజకీయ విభాగంగా, మౌత్ పీస్ లాగా పనిచేస్తోంది. ఈ బూటకపు దర్యాప్తు ప్రారంభం నుండి దాని ఉద్దేశ్యం ఆప్‌ని ఇరికించడం, దాని అగ్రనేతలందరినీ అరెస్టు చేయడం, పార్టీని అణిచివేయడం. ఆప్ పార్టీని, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ ఛార్జ్‌షీట్ రూపొందించడం రాజకీయ కుట్రలో భాగమే” అని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఛార్జిషీట్‌ను అనుసరించి కేజ్రీవాల్, పార్టీ ఆస్తులు, బ్యాంకు ఖాతాలన్నీ జప్తు చేయబడతాయని ఆప్ ఆరోపించింది. దర్యాప్తు సంస్థ "భారీగా వేధింపులకు, అన్యాయానికి కారణమవుతుందని పేర్కొంది. “రెండేళ్ళకు పైగా దర్యాప్తు తర్వాత, 500 దాడు నిర్వహించిన తరువాత, ఎనిమిది ఛార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత, ఏ ఆప్ నాయకుల నుండి ఒక్క రూపాయి కూడా ఈడీ రికవరీ చేయలేదని.. చరిత్రలో ఇది మొదటి కేసు… ఈడీ మొత్తం కేసు ప్రకటనల ఆధారంగా నిర్మించబడింది. నిందితులుగా మారిన అప్రూవర్లు, వీరంతా బీజేపీతో సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ ప్రకటనల వాస్తవికతపై కోర్టులు ఈడీ ని ప్రశ్నించినప్పుడల్లా, ఈడీ వద్ద సమాధానాలు లేవు” అని AAP ఆరోపించింది.

Advertisment