MP Sanjay Singh: తీహార్ జైలు నుంచి ఎంపీ విడుదల

తీహార్ జైలు నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ విడుదల అయ్యారు. గతేడాది అక్టోబర్ 4న లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 6 నెలలు తీహార్ జైలులో గడిపిన ఆయన ఈరోజు విడుదల అయ్యారు.

New Update
MP Sanjay Singh: తీహార్ జైలు నుంచి ఎంపీ విడుదల

MP Sanjay Singh: తీహార్ జైలు నుంచి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ విడుదల అయ్యారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరికింది. ఆయనకు బెయిల్ లభించింది. లిక్కర్ స్కామ్ విచారణ ముగిసే వరకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది అత్యున్నత న్యాయస్థానం. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సంజయ్ సింగ్ ప్రచారంలోనూ పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. సంజయ్ సింగ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించారని ఈడీ ఆరోపిస్తోంది. లిక్కర్ స్కామ్ తయారీ, అమలులో ఆయనది ప్రధాన పాత్ర అని చెబుతోంది. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్ 4న ఆయనను అరెస్ట్ చేసింది. తాజాగా సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల లభించడంతో దాదాపు ఆరు నెలల తర్వాత బయటకు వచ్చారు.

మరోవైపు కేజ్రీవాల్ బెయిల్ పై ఉత్కంఠ..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే.. ఈ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ లభిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. మొదటగా కేజ్రీవాల్ కు ఆరు రోజుల ఈడీ కస్టడీ విధించింది.. ఆ తరువాత మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీని పొడిగించింది. ఈ నెల 1వ తేదీన ఈడీ.. కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని తద్వారా మద్యం కుంభకోణం కేసులో అనేక విషయాలు బయటకు వస్తాయని కోర్టుకు విన్నపించుకోగా..  ఏప్రిల్ 15వ తేదీ వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగించింది. ఈ కేసులో తనకు ఊరట లభిస్తుందని అనుకున్న కేజ్రీవాల్ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. 

Advertisment
తాజా కథనాలు