Instagram Influencer: రీల్స్‌ చేస్తుండగా ప్రమాదం.. లోయలోపడి ట్రావెల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ మృతి!

మహారాష్ట్రలో వర్షాలు పడిన ప్రాంతంలో రీల్స్‌ చేస్తుండగా..కాలు జారి లోయలో పడి ఓ ట్రావెల్‌ ఇన్‌ ఫ్లూయెన్స్‌ర్‌ మృతి చెందింది.ఒక లోయ దగ్గర వర్షం పడుతున్న సమయంలో రీల్స్ చేస్తోంది. వానల వల్ల ఆ ప్రాంతం అంతా చిత్తడిగా మారి కాలు జారి 300 అడుగుల లోయలో పడింది.

New Update
Instagram Influencer: రీల్స్‌ చేస్తుండగా ప్రమాదం.. లోయలోపడి ట్రావెల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ మృతి!

Maharashtra: మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కొన్ని ప్రాంతాలు చిత్తడి చిత్తడిగా మారాయి. ఈ క్రమంలో రీల్స్ చేయడానికి ప్రయత్నించిన ఓ ట్రావెల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన రాయ్‌గఢ్‌ సమీపంలోని కుంభే జలపాతం వద్ద జరిగింది.

రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల ఇన్‌స్ట్రాగామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆన్వీ కామ్‌దార్ (Aanvi Kamdar).. ఒక లోయ దగ్గర వర్షం పడుతున్న సమయంలో రీల్స్ చేస్తోంది. వానల వల్ల ఆ ప్రాంతం అంతా చిత్తడిగా మారి కాలు జారి 300 అడుగుల లోయలో పడింది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆరు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి యువతిని బయటకు తీసుకుని వచ్చారు. యువతిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది.

జులై 16న ఆన్వీ.. తన స్నేహితులతో కలిసి కుంభే జలపాతం దగ్గరకు వెళ్లింది. రీల్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు లోయలోపడింది. స్థానిక అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కోస్ట్ గార్డ్, కోలాడ్ రెస్క్యూ టీమ్, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సిబ్బంది బయటకు తీశారు. విహారయాత్ర.. విషాదంగా మారడంతో స్నేహితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.


Also Read: అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాలో వానలే..వానలు!

Advertisment
తాజా కథనాలు