Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ – రీనా దత్తా కుమార్తె ఐరా ఖాన్ వివాహం బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే ను గత వారం ముంబైలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
తాజాగా, ఈ జంట రాజస్థాన్ ఉదయ్‌పూర్ లో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
కుమార్తె పెళ్లి సందర్భంగా స్టార్ హీరో అమీర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. పెళ్లి తంతులో భాగంగా నూతన వధూవరులు ఉంగరాలు మార్చుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.