Aadhar Voter ID Link Updates: ఆధార్-ఓటర్ ఐడీ లింక్.. కీలక ప్రకటన కేంద్ర ప్రభుత్వం..

ఓటర్ ఐడీ, ఆధార్‌ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఓటర్ ఐడీ ఆధార్ లింక్‌ కోసం ఫామ్ 6బి సమర్పణకు మార్చి 2024 చివరి తేదీగా ప్రకటించింది. అయితే, తప్పనిసరిగా లింక్ చేయాలనే రూల్ ఏమీ లేదని, ఓటర్లు తమ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చునని తెలిపింది.

Aadhar Voter ID Link Updates: ఆధార్-ఓటర్ ఐడీ లింక్.. కీలక ప్రకటన కేంద్ర ప్రభుత్వం..
New Update

Aadhar Voter ID Link Updates: ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఓటర్ ఐడీ కార్డు (Aadhaar Link with Voter ID)తో ఆధార్ కార్డును లింక్ చేయడంపై భారత ప్రభుత్వం ఇంకా స్పష్టమై నిర్ణయం తీసుకోలేదని లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియ కొనసాగుతోందని, అయితే.. ఓటర్ ఐడీతో ఆధార్‌ను అనుసంధానం చేయాలనే లక్ష్యం ఏదీ ఇవ్వలేదని మంత్రి తెలిపారు.

ఓటర్ ఐడీతో ఆధార్‌ను లింక్ చేయడం ఇంకా ప్రారంభించలేదని భారత ఎన్నికల సంఘం తెలియజేసిందని న్యాయ మంత్రి తెలిపారు. అలాగే.. ఫారమ్ 6B సమర్పించడానికి గడువును ఒక సంవత్సరం పొడిగించారు. అయితే, ఓటర్ ఐడీతో ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి కాదన్నారు. మీ ఇష్టానుసారం ఓటర్ ఐడీతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవచ్చునని తెలిపారు. ఒకవేళ ఎవరైనా తమ ఓటర్ ఐడీని ఆధార్‌తో లింక్ చేయాలనుకుంటే.. సదరు వ్యక్తులు ఫారమ్ 6బిని సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం గడువును మార్చి 2024 వరకు పొడిగించారు.

ఓటరు గుర్తింపు కార్డు చాలా కీలకం..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్టోరల్ రోల్‌ల తయారీ, దిశ, నియంత్రణ బాధ్యత భారత ఎన్నికల కమిషన్‌పై ఉంది. ఎన్నికల కమిషన్ బహుళ స్థాయి భద్రతతో ఎన్నికల డేటా, సమగ్రతను నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ఎన్నికల సంఘం ప్రకారం ఓటరు ఐడీలో వ్యక్తి పేరు లేకుంటే అతనికి ఓటు హక్కు ఉండదు. దీంతో పాటు.. మీరు గుర్తింపు కార్డు, ఇతర ప్రయోజనాల కోసం కూడా ఓటర్ IDని ఉపయోగించవచ్చు.

ఓటరు ఐడీని లింక్ చేయడం తప్పనిసరి కాదు..

ఓటర్ ఐడీతో ఆధార్ కార్డును లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం అడ్వైజరీ జారీ చేయగా.. ఆ తర్వాత ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయం. ఈ అంశం తీవ్ర వివాదాస్పదం అవగా.. కేంద్రం వెనుకడుగు వేసింది. కావాల్సిన వారు తమ ఓటర్ ఐడీని ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అలాగని.. ప్రతి ఒక్కరూ ఓటర్ ఐడీతో ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి కాదని ప్రకటించింది.

Also Read:

ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు!

పైసల్లేక పట్నం నుంచి నడిచొచ్చినా.. రూపాయి చిక్క దొరికితే బస్సు ఎక్కిన: జగ్గారెడ్డి

#aadhaar-news #aadhar-voter-id-link-updates #aadhar-voter-id-link-news #voter-id-news #voter-id-updates
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe