/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/paan-aadhar.webp)
ఆధార్ ను పాన్ కార్డుతో అనుసంధానం చేసుకునే గడువు నిన్న ( శుక్రవారం)తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ కీలక ప్రకటన చేసింది. నిన్నటితో చివరి తేదీ కావడంతో ప్రజలు ఆన్ లైన్ లో పోటెత్తారు. దీంతో చాలా మంది చలాన్ పేమెంట్, డాక్యుమెంట్ల లింకింగ్ లో ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఈ గడవును మరోసారి పెంచుతారని పలువురు భావించినప్పటికీ..ఐటీ శాఖ మాత్రం ఎలాంటి గడువును పెంచలేదు. కానీ ఓ కీలక ప్రకటన మాత్రం చేసింది.
చలాన్ డౌన్ లోడు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఐటీ శాఖ తెలిపింది. చలాన్ కోసం చెల్లింపులు పూర్తిచేసిన వారు ఐటీ వెబ్ సైట్లో లాగిన్ అయిన తర్వాత ఈ పే ట్యాక్స్ సెక్షన్ లో చెల్లింపు పూర్తి అయ్యిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది. అందులో పేమెంట్ పూర్తియనట్లు చూపించినట్లయితే..ఆధార్, పాన్ లింక్ చేసుకోవచ్చని వెల్లడించింది.
కాగా చెల్లింపు పూర్తి అయిన వారు రిజిస్టర్డ్ ఈమెయిల్ కు చలాన్ కు సంబంధించిన రశీదు కాపీ వస్తుందని ఐటీ శాఖ వెల్లడించింది. చెల్లింపు పూర్తియినప్పటికీ..ఆధార్, పాన్ లింక్ ప్రక్రియ పూర్తి కానట్లయితే అలాంటి వాటిని ఐటీ శాఖ పరిగణలోనికి తీసుకుంటుందని కూడా తెలిపింది. ప్రత్యేకంగా చలాన్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.