/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/women-2-jpg.webp)
A Young Women Sucide: ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని వన్ టౌన్ పరిధిలో ఈ విషాదం నెలకొంది. తమ కూతురి వీణా మాధురి మృతికి వేముల మోషే అనే యువకుడి వేధింపులే కారణామని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Also Read: మంత్రి కొట్టు సత్యనారాయణ వర్సెస్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
వివరాల్లోకి వెళితే..వేముల మోషే అనే యువకుడు వడ్డెరగూడెం చిరంజీవి బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. వీణా టెన్త్ క్లాస్ లో ఉన్నప్పటి నుండి తనను ప్రేమిస్తున్నాడంటూ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోషే పై వీణా తన తల్లిదండ్రులకు కంప్లైంట్ చేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మోషేపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Also Read: హద్దులు చెరిపేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. హాట్ పిక్స్ తో హల్‌చల్.!
అయితే, బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ వేధింపులకు గురిచేశాడు. ఎందుకు ప్రేమించవు..ఎందుకు పెళ్లి చేసుకోవు అంటూ తనను బాగా ఇబ్బంది పెట్టేవాడని యువతి బంధువులు చెబుతున్నారు. అతడి వేధింపులు భరించలేకే ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు, బంధువులు అంటున్నారు. తమ కూతురి మృతికి కారణామైన మోషేను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.