Hyderabad: అమెరికాలో మిస్సైన హైదరాబాద్ యువకుడు.. నెల రోజులుగా కనిపించని ఆచూకి

అమెరికాలో హైదరాబాద్ యువకుడు మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ నెల రోజుల క్రితం మిస్ అయ్యాడు. అర్ఫాత్ బంధువును 1200 యూఎస్ డాలర్లు డిమాండ్ చేస్తూ ఓ కాల్ వచ్చింది. అయితే, సదరు కాలర్ పేమెంట్ మోడ్ లాంటి ఇతర వివరాలేవీ చెప్పలేదు. యువకుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Hyderabad: అమెరికాలో మిస్సైన హైదరాబాద్ యువకుడు.. నెల రోజులుగా కనిపించని ఆచూకి
New Update

Hyderabad: అమెరికాలో ఓ హైదరాబాద్ యువకుడు మిస్సై దాదాపు నెల రోజులు గడుస్తుంది. అయినా ఇప్పటికి అతడి ఆచూకి తెలియడం లేదు. ఇంతకు ఆ యువకుడు ఎవరు? ఆమెరికాలో ఏం చేస్తున్నాడు? ఎలా మిస్ అయ్యాడు? అనే వివరాలు తెలుసుకుందాం.  హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ యువకుడు అమెరికాలోని క్లీవ్ లాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు.

ప్రతి రోజూ ఇంటికి ఫోన్ చేసే మాట్లాడే అర్ఫాత్ కొద్ది రోజులుగా ఇంటికి ఫోన్ చేయలేదు. హైదరాబాద్ లో ఉంటున్న తన పేరెంట్స్ కాల్ చేసినా కూడా ఆ యువకుడి ఫోన్ నాట్ రీచబుల్ వస్తోంది. ఆందోళన చెందిన యువకుడి తండ్రి మహమ్మద్ సలీం హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో, ఈ విషయంపై పోలీసులు ఆరా తీయగా అర్ఫాత్ కనిపించట్లేదని యూఎస్ లో కూడా కంప్లైంట్ నమోదయ్యిందని తెలిసింది.

Also Read: పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్.. రష్మిక బర్త్ డే సర్ ప్రైజ్ అదిరిపోయిందిగా..!

అమెరికాలోని యువకుడు అర్ఫాత్ బంధువు ఈ మేరకు కంప్లైంట్ చేయగా అక్కడ కూడా దాదాపు నెల రోజుల నుండి ఎలాంటి సమాచారం లభించలేదని తేలింది. ఇదిలా ఉండగా నాచారంలోని అర్ఫాత్ బంధువును 1200 యూఎస్ డాలర్లు డిమాండ్ చేస్తూ ఒక కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, సదరు కాలర్ పేమెంట్ మోడ్ లాంటి ఇతర వివరాలేవీ చెప్పలేదని.. దీనిపై ఆరా తీసిన పోలీసులకు కూడా కాలర్ డీటెయిల్స్ కానీ, అర్ఫాత్ ఆచూకీ కానీ లభించలేదని తెలుస్తోంది.

అయితే, అర్ఫాత్ ఆఖరిగా వాల్ మార్ట్ దగ్గర కనిపించాడని అక్కడి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఆ సమయంలో అతను వైట్ టీషర్ట్ రెడ్ జాకెట్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడని.. ఇంతకు మించి అర్ఫాత్ గురించి ఎలాంటి సమాచారం లేదని పోలీసులు వెల్లడించారు. కాగా, న్యూయార్క్ లోని ఇండియన్ ఎంబసీ కూడా ఈ కేసుపై పని చేస్తోందని తెలుస్తోంది. అయితే, అధికారులు ఎందుకు అతడి ఆచూకిని గుర్తుంచలేకున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

#hyderabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe