ఏం గుండెరా అది.. చిరుతను తాళ్లతో బంధించి బైక్‌పై తీసుకెళ్లాడు

సాధారణంగా కుక్క అరిస్తేనే ఎక్కువమంది భయంతో పరుగులు తీస్తారు. అలాంటిది చిరుతపులి ఎదురైతే ఇంకేమైనా ఉందా? గుండె కిందకు జారాల్సిందే. కానీ ఓ వ్యక్తి మాత్రం చిరుతతో పోరాడి దానిని తాళ్లతో బంధించాడు. నమ్మశక్యంగా లేదా? అయితే కింద స్టోరీ చదవండి.

ఏం గుండెరా అది.. చిరుతను తాళ్లతో బంధించి బైక్‌పై తీసుకెళ్లాడు
New Update

publive-image

ఆడు మగాడ్రా బుజ్జి.. చిరుతతో ఫైట్..

సింహాం, పులి, చిరుత లాంటి క్రూరమృగాలతో పోరాడటటం సాధారణంగా సినిమాల్లో చూస్తూంటాం. కానీ నిజజీవితంలో అవి ఎదురైతే ప్రాణ భయంతో లాగెత్తాల్సిందే. కానీ కర్ణాటకలో ఓ యువ రైతు మాత్రం తనపైకి దాడి చేయడానికి వచ్చిన చిరుతను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అనంతరం దానిని తాళ్లతో బంధించి తన బైక్‌పై తీసుకెళ్లి అటవీ అధికారులకు అప్పగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏం గుండెరా వీడిది.. ఆడు మగాడ్రా బుజ్జి అంటూ నెటజిన్లు కామెంట్స్ చేస్తున్నారు.

పొలం వెళ్తుండగా చిరుత దాడి..

కర్ణాటకలోని హసన్ జిల్లా బాగివలు గ్రామానికి చెందిన వేణుగోపాల్ అలియాస్ ముత్తు అనే రైతు రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం తన బైక్‌పై పొలానికి వెళ్తున్నాడు. అయితే మార్గమధ్యంలో ఓ చిరుతపులి హఠాత్తుగా అతడిపై దాడి చేసింది. దీంతో బిత్తరపోయిన ముత్తు మరోదారి లేక దానిపై తిరగబడ్డాడు. అనంతరం చిరుతను బంధించి తాళ్లతో కదలకుండా కట్టేశాడు. ఈ పోరులో చిరుతతో పాటు ముత్తుకు గాయాలయ్యాయి. ఆ తర్వాత ఓ కర్ర సాయంతో దాన్ని తన బైక్ వెనకాల వేలాడదీసి గ్రామంలోకి వచ్చి అటవీశాఖ అధికారులకు దానిని అప్పగించాడు. ముందు షాక్ అయిన గ్రామస్తులు, అధికారులు తర్వాత జరిగిన ఘటన తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

అడవిలో వదిలిపెడతాం..

అటవీశాఖ చట్టం ప్రకారం.. వన్యప్రాణులపై దాడి చేసినందుకు శిక్షలు విధిస్తారు. కానీ ముత్తు తన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా చిరుతపులిని స్వల్పంగా గాయపరిచడంతో ఎలాంటి కేసు ఉండదని అధికారులు తెలిపారు. 10నెలల వయసున్న ఆ చిరుతకు చికిత్స చేసిన అనంతరం అడవిలో వదిలిపెడతామని పేర్కొన్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe