/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/a-young-man-attacked-the-three-people-while-under-the-influence-of-alcohol.webp)
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో అర్థరాత్రి మన్ ప్రీత్ సింగ్ అనే యువకుడు హంగామా సృష్టించాడు. తల్వార్ చేతులో పట్టుకుని రెచ్చిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న ముగ్గురిపై దాడికి పాల్పడ్డాడు. తల్వార్ తో విచక్షణారహితంగా ముగ్గురిని పొడిచాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. మద్యం మత్తులో అడ్డువచ్చిన వారిపై మను ప్రీత్ సింగ్ తల్వార్ తో దాడికి యత్నించాడు. అతన్ని చూసిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో రంగంలోని దిగిన పోలీసులు మను ప్రీత్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ద్యాప్తు చేపట్టారు. మను ప్రీత్ సింగ్ దాడిలో సయ్యద్ అక్బర్, మోను సింగ్ తోపాటు రెండేళ్ల చిన్నారి అఖిల్ కు గాయపడ్డారు. వీరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.