విహార యాత్రలో ఘోర విషాదం..గల్లంతైన ఓకే కుటుంబంలోని 5గురు సభ్యులు! విహార యాత్రకు వెళ్లి ఓకే కుటుంబంలోని 5 గురు సభ్యులు గల్లంతైన ఘటన మహారాష్ట్రలోని లోనావాలా డ్యాం సమీపంలోని జలపాతంలో చోటు చేసుకుంది.ఈ ఘటనలో మగ్గురు మృతదేహాలు లభ్యమవగా..మిగిలిన వారికోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు పూణేలోని హడప్సర్ ప్రాంత వాసులుగా తెలుస్తోంది. By Durga Rao 01 Jul 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి పూణేలోని హడప్సర్ ప్రాంతంలోని సయ్యద్ నగర్ లోని అన్సారీ కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని భూషి లోనావాలా డ్యామ్ సమీపంలోని జలపాతానికి విహార యాత్రకు వెళ్లారు.అయితే ఆ ప్రాంతంలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ ప్రాంతాలనుంచి నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది.కొద్ది సేపటికి జలపాతంలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో దానిలోకి దిగి సరదాగా వారు గడిపారు. #UPDATE | Pune: One more body recovered and the rescue operations have been halted for today. The search and rescue will resume tomorrow morning: Pune Rural Police (Video Source: Pune Rural Police) https://t.co/FiGBK4uVhN pic.twitter.com/5JzC6335XL — ANI (@ANI) June 30, 2024 అయితే ప్రమాదవశాత్తు నీటి ప్రవాహం ఉధృతంగా సాగటంతో అన్సారీ కుటుంబంలోని ఒక మహిళ నలుగురు చిన్నారులు నీటిలో కొట్టుకుపోయారు.సమాచారం అందుకున్న సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. జలపాతం కింద రిజర్వాయర్ లో మహిళ,ఇద్దరు చిన్నారుల మృతదేహాలను సహాయ బృందాలు గుర్తించాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఆదివారం లోనావాలాను సందర్శించటానికి 50,000 మందికి పైగా ప్రజల చేరుకున్నారు. అంతకముందు వీరిలో చాలా మంది నీటి మధ్యలో సరదాగా గడిపారు. #crime-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి