Adilabad Murder: ప్రియుడి కోసం భర్తను చంపించిన భార్య

TG: అదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం భర్తను కాటికి చేర్చింది భార్య. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భర్త జాదవ్‌ గజానంద్‌‌ను రౌడీలకు సుపారీ ఇచ్చి హత్య చేయించింది భార్య. ఈ ఘటన రెండురోజుల క్రితం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.

New Update
Adilabad Murder: ప్రియుడి కోసం భర్తను చంపించిన భార్య

Adilabad Murder: ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించేసింది ఓ భార్య. ప్రియుడి మోజులో పడి సుపారీ ఇచ్చి మరి భర్తను హత్య చేయించింది. ఈ దారుణ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన రెండురోజుల క్రితం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.

అదిలాబాద్ కు చెందిన టీచర్‌ జాదవ్‌ గజానంద్‌ జైనథ్‌, రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. అయితే భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా, అసలు దొంగలు ఎవరనేది బయటపెట్టారు. మృతుడు జైనథ్ భార్య మహేష్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఆమె ప్రియుడితో సంతోషంగా ఉండాలంటే, తన భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. భర్త చనిపోయిన,తన మీద ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని, ఒక సుపారీ గ్యాంగ్ తో ఫోన్లో మాట్లాడి,డీల్ కుదుర్చుకుని వారితో హత్య చేయించింది. అయితే భర్త హత్య జరిగిన రెండురోజుల తర్వాత, భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త రెండురోజుల నుంచి ఇంటికి రాలేదని, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదని కంప్లైంట్ ఇవ్వగా, పోలీస్ విచారణలో భాగంగా ఈ నిజాలు బయటపడ్డాయి.ఇక పోలీసులు ఆ మహిళతో పాటు హత్య చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు