ప్రియుడి మోజులో భర్తను దారుణంగా చంపిన భార్య ఇటీవల ప్రియుడి మోజులో పడి భర్తలను దారుణంగా చంపుతున్న భార్యలు ఎక్కువైపోతున్నారు. మూడు ముళ్లు, ఏడు అడుగులు వేసిన సంగతి కూడా మర్చిపోయి పరాయి వ్యామోహంతో జీవితాలు బలి చేసుకుంటున్నారు. By BalaMurali Krishna 05 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి ప్రియుడి మోజులో పడి భర్తలను దారుణంగా చంపుతున్న భార్యల సంఖ్య ఇటీవల ఎక్కువైపోతుంది. దైవసాక్షిగా, కుటుంబసభ్యులు సమక్షంలో మూడు ముళ్లు, ఏడు అడుగులు వేసిన సంగతి కూడా మర్చిపోయి పరాయి వ్యామోహంతో జీవితాలు బలి చేసుకుంటున్నారు. వైజాగ్‌లో కానిస్టేబుల్ రమేశ్ హత్య ఘటన మరువకుముందే తాజాగా తిరుపతిలో కూడా ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో చంద్రశేఖర్ అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరిని 11ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. చంద్రశేఖర్ కొన్నేళ్లుగా చేబ్రోలులో టైల్స్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అయితే ఇంటి పక్క నివసించే సత్యనారాయణతో భువనేశ్వరి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అడ్డుగా ఉన్నాడని పక్కా స్కెచ్.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చడానికి పక్కా స్కెచ్ వేసింది. స్కెచ్‌లో భాగంగా ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో చంద్రశేఖర్‌ను ప్రియుడితో కలిసి గొంతు కోసి హత్య చేసింది. అనంతరం తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు పీక కోసి హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రియుడు సత్యనారాయణతో పాటు భువనేశ్వరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రైవర్ కోసం భర్తను చంపేసింది.. రెండు రోజుల క్రితం విశాఖపట్నంలో ఏకంగా పోలీసునే భార్య హత్య చేయించిన ఘటన తెలిసిందే. వన్ టౌన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేష్‌ను అతడి భార్య.. ప్రియుడితో కలిసి అంతమొందించింది. కొంతకాలంగా ట్యాక్సీ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య శివాని ఇంట్లోనే పథకం ప్రకారం దిండుతో భర్తను హత్య చేసి గుండెనొప్పిగా చిత్రకరించింది. అనంతరం గుట్టుచప్పుడుగా అంతక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసుల విచారణలో భార్య అక్రమ సంబంధం బాగోతం బయటపడింది. దీంతో భార్య, ప్రియుడిని అరెస్ట్ చేశారు. బావతో అక్రమ సంబంధం.. ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్ మణికొండలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. నల్గొండ జిల్లాకు చెందిన రాగ్యా నాయక్, పెద్దవూరకు చెందిన మహిళతో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. రాగ్యా నాయక్ హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ మణికొండలో నివిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇబ్రహీంపట్నం గునుగల్‌లో రాగ్యానాయక్ తోడల్లుడు రఘుపతి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. రఘుపతి చుట్టపుచూపుగా తరచూ రాగ్యానాయక్ ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో అతడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం రాగ్యానాయక్‌కు తెలియడంతో భార్యను నిలదీశాడు. ప్రవర్తన మార్చుకోవాలని భార్యను పలుమార్లు హెచ్చరించాడు. దీంతో తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. పోలీసుల విచారణలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తేలింది. పరాయి మగాళ్ల మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేరుస్తున్నారు. చివరికి చక్కని సంసార జీవితం నాశనం చేసుకుని కటకటాలు లెక్కిస్తున్నారు. ఇటు తండ్రి లేక, అటు తల్లి జైలులో ఉండటంతో అభం శుభం తెలియన పిల్లలు అనాథలుగా మారుతున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి