అజిత్‌ పవార్‌కి బిగ్‌ షాక్‌.. బాబాయ్‌ దెబ్బకు కొడుకు ఫ్యూజులౌట్..!!

బాబాయ్..కొడుకు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బాబాయ్ దెబ్బకు కొడుకు గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ శరద్ పవార్ తన రాజకీయ మార్క్ ను చూపిస్తున్నారు. గతవారం రోజులుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో అలజడి కొనసాగుతూనే ఉంది. ఎన్సీపీలో చెలరేగిన అంతర్గత తిరుగుబాటు కారణంగా మహారాజకీయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తాజాగా తిరుగుబాటులో వర్గంలో ఉన్న ఓ ఎమ్మెల్యే అజిత్ పవార్ కు హ్యాండిచ్చి శరద్ పవార్ తో చేతులు కలపడం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.

New Update
అజిత్‌ పవార్‌కి బిగ్‌ షాక్‌.. బాబాయ్‌ దెబ్బకు కొడుకు ఫ్యూజులౌట్..!!

ఎన్సీపీలో కొనసాగుతున్న ఆందోళనలు ఓ కొలిక్కి రావడం లేదు. మహారాష్ట్ర అధికార కూటమిలో చేరేందుకు అజిత్ పవార్ తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఎమ్మెల్యేలు రెండు వర్గాల మధ్య దాగుడుమూతల ఆటలు ఆడుతున్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ ఎవరి వాదనలు వారు వినిపిస్తూ ఈసీని ఆశ్రయించారు. అయితే ఈసీ వీరి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.

maha politics

అయితే తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది. అజిత్ వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే శదర్ పవార్ వర్గంలోకి వెళ్లారు. గతవారంలో రోజులుగా ముగ్గురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్ కు హ్యాండిచ్చారు. రాంరాజే నాయక్ నింబాల్కర్, దీపక్ చవాన్ తోపాటు మూడో ఎమ్మెల్యే మక్రాంద్ తిరిగి పవార్ వర్గానికి చేరుకున్నారు. సతారా జిల్లాలోని వై అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మక్రాంద్ జాదవ్ పాటిల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మక్రాంద్ తోపాటు వందలాది మంది మద్దతుదారులు ఆయన బాటలోనే శరద్ పవార్ శిబిరానికి చేరుకున్నారు. అయితే శరద్ పవార్ వర్గానికి చెందిన కిరణ్ లహమాటే అజిత్ శిబిరంలోకి మారి...తర్వాత శరద్ శిబిరానికి వెళ్లి మళ్లీ అజిత్ వర్గంలోకి వచ్చారు.

అజిత్ వర్గం బీజేపీలో చేరడంతో ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. పార్టీని తన నియంత్రణలోకి తీసుకునేందుకు శరద్ పవార్, ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ మధ్య చీలిక ఏర్పడింది. జూలై 5న ఇరువర్గాలు సమావేశమై తమ బలాన్ని నిరూపించుకున్నాయి. అజిత్ వర్గం భేటీలో 35మంది ఎమ్మెల్యేలు ఉండగా...శరద్ పవార్ వర్గంలో 15మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రచారం జరిగింది.

అజిత్ పవార్ మాత్రం తనకు 40మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం చేవారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి 53మంది ఎమ్మెల్యేలు ఉండగా..పార్టీని నియంత్రించడానికి అజిత్ పవార్ కు 36మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీలో తనదే పెద్ద ప్రతిపక్షపార్టీగా పేర్కొంటూ అసెంబ్లీలో ప్రతిపక్షనేత పదవి కోసం కాంగ్రెస్ డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు