KL Rahul-Goenka: 'టీ'కప్పులో తుఫాను.. గొయెంకా-రాహుల్ గొడవపై స్పందించిన లాంగర్!

లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ పై జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేసిన అంశంపై కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించారు. ప్రొఫెషనల్ క్రికెట్ లో అధిక ఒత్తిడి సాధారణం. ఇదొక టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఎవరైనా సరే వందశాతం జవాబుదారీతనంగా ఉండాల్సిందే అన్నారు.

New Update
KL Rahul-Goenka: 'టీ'కప్పులో తుఫాను.. గొయెంకా-రాహుల్ గొడవపై స్పందించిన లాంగర్!

KL Rahul-Goenka: సన్ రైజర్స్ హైదరాబాద్‌ తో మ్యాచ్ లో ఘోర పరాభవం ఎదుర్కొన్న లఖ్‌నవూ ఆటగాళ్లపై ఆ జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ ను అందరిముందే తిట్టడం చర్చనీయాంశమైంది. గోయెంకా తీరుపై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్, పలువురు మాజీలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే దీనిపై లఖ్‌నవూ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్, అసిస్టెట్ కోచ్ లాన్స్‌ క్లూసేనర్‌ ఈ విషయాన్ని తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించడం విశేషం.

క్రికెట్‌ ప్రేమికుల మధ్య జరిగిన బలమైన సంభాషణ..
ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ ఇష్యూపై మాట్లాడిన లాన్స్ క్లూసేనర్.. ‘ఇద్దరు క్రికెట్‌ ప్రేమికుల మధ్య జరిగిన బలమైన సంభాషణలో నాకేమీ పొరపాటు కనిపించలేదు. ఇది టీకప్పులో తుపాను లాంటిది. ఇలాంటి చర్చలనే అందరూ ఇష్టపడతారు. అప్పుడే జట్ల ప్రదర్శన మరిత మెరుగుపడుతుందని నేను భావిస్తున్నా. మేము దీన్ని పెద్ద ఇష్యూగా చూడట్లేదు' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అధిక ఒత్తిడి సాధారణమే..
ఇక లాంగర్ సైతం ప్రొఫెషనల్ క్రికెట్ లో అధిక ఒత్తిడి సాధారణమేనని అన్నాడు. 'నేను ఆటకు వీడ్కోలు పలికిన వెంటనే నేరుగా అసిస్టెంట్ కోచింగ్‌ బాధ్యతలు చేపట్టాను. కోచ్ ఉద్యోగం క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమైనది. ఈ పనిలో 100% జవాబుదారీతనంగా ఉండాలి. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి టోర్నీల్లో కోచ్ గా ఉండటం అనుకున్నంత ఈజీ కాదు. చాలా కష్టం. మీరు ఆటగాడిగా ఉన్నప్పుడు మీపై మీకు నియంత్రణ ఉంటుంది. మీ పనితీరుకు మీరు పూర్తి బాధ్యత వహిస్తారు. మీ నియంత్రణలో లేని ఏకైక విషయం మీడియా ఏమి రాస్తుందనేది. ఇతర వ్యక్తులు మీ గురించి ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు బంతిని చూడటంపై మాత్రమే దృష్టి పెట్టాలి. మీ వ్యక్తిగత పరుగులు చేస్తే ప్రశంసలు పొందుతారు. అందరి మెప్పు పొందుతారు. అయితే కెప్టెన్సీ విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది. జట్టును ముందుంచి నడిపించాల్సిన బాధ్యత ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఐపీఎల్‌-17లో ఆశించిన స్థాయిలో రాణించని నేపథ్యంలో రాహుల్‌ను కొనసాగించకూడదని ఎల్‌ఎస్‌జీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాహుల్‌ కూడా జట్టు మారే ఆలోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.  అంతేకాదు రాబోయే సీజన్ లో రాహుల్ ఆర్ సీబీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు కూడా చర్చనడుస్తోంది. ఏమైనా ఈ సీజన్ తర్వాత క్లారిటీ రానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు