Crime news: కన్న కొడుకే కాలయముడు..తండ్రిని అత్యంత కర్కశంగా ఇంట్లో మంచంపైనే..

కృష్ణ జిల్లా భావదేవరపల్లిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకే తండ్రిని అత్యంత కర్కశంగా ఇంట్లో మంచంపైనే చంపి, డీజిల్ పోసి తగులబెట్టాడు. ఆస్థి కోసమే ఇంతటి దారుణానికి తెగించినట్లు తెలుస్తోంది.

New Update
Crime news: కన్న కొడుకే కాలయముడు..తండ్రిని అత్యంత కర్కశంగా ఇంట్లో మంచంపైనే..

Son killed Father in Krishna District: కన్న కొడుకే కాలయముడయ్యాడు. కన్నతండ్రిని అత్యంత కర్కశంగా ఇంట్లో మంచంపైనే చంపి, అనంతరం డీజిల్ పోసి తగులబెట్టేశాడు. ఈ అమానవీయ ఘటన నాగాయలంక మండలం భావదేవరపల్లిలో శుక్రవారం రాత్రి జరిగింది. ఆస్థి కోసం బండే హరిమోహనరావును అతని కుమారుడు పవన్ కళ్యాణ్ ఇంట్లోనే దారుణంగా డీజిల్ పోసి కాల్చి చంపేశాడు. తండ్రి మృతదేహం మొత్తం కాలి బుడిద అయింది. వెంటనే అప్రమత్తమైన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: ‘అమ్మా.. నిన్ను చూడాలి’.. గుక్కపట్టి ఏడ్చిన చిన్నారి.. కర్నూలులో గుండెలు పిండేసే దృశ్యం.!

శనివారం ఉదయం ఘటన స్థలికి చేరుకున్నారు అవనిగడ్డ సీఐ ఎల్.రమేష్, ఎస్ఐ  నాగాయలంక.  హరి మోహనరావు మృతదేహంను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పంచనామా అనంతరం మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, నిందితుడి పవన్ కళ్యాణ్ పై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. తండ్రిని అతి దారుణంగా చంపడంపై స్థానికంగా కలకలం రేపింది. తండ్రిని బాధ్యతగా ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన కొడుకు ఇంత దారుణానికి తెగబడ్డంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు..నేతలకు టార్గెట్లు ఫిక్స్

Advertisment
తాజా కథనాలు