Crime News: ఆస్తి పంపకాల విషయంలో ఓ కసాయి కొడుకు తన తల్లిదండ్రుల పట్ల మృగంలా ప్రవర్తించాడు. తనను కొట్టవద్దనని ఆ తల్లి వేడుకుంటూ దండం పెట్టినా ఏ మాత్రం కనికరించలేదు. ఆ మాతృమూర్తిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. కన్నతల్లి గుండెలపై తన్నాడు. ఈ అమానుష ఘటన అన్నమయ్య జిల్లా నీరుగుట్టివారిపల్లెలో చోటుచేసుకుంది.
కనికరించని కొడుకు..
మదనపల్లి రెండవ పట్టణ పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని నీరు గట్టువారిపల్లె, అయోధ్యనగర్ లో కాపురం ఉంటున్న దంపతులు వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మల కుమారుడు శ్రీనివాసులురెడ్డికి భూ వివాదం ఉంది. ఆస్తి కోసం తల్లితండ్రుల మీద దారుణంగా దాడి చేశాడు కన్న కొడుకు. సోదరుడికి భూమి ఎలా రాశారంటూ దాడి చేశాడు. దీంతో తల్లి దండ్రులు దన్నం పెడుతున్నా వదలలేదు. కసాయి కొడుకు శ్రీనివాసులు రెడ్డి కొట్టే దెబ్బలకు ఆ వృద్ధ దంపతులు తల్లఢిల్లడం చూపరుల హృదయాలను తీవ్రంగా కలవేసింది.
Also Read: మంత్రి రోజాకు సొంత పార్టీలోనే అసమ్మతి.. జడ్పీటీసీ మురళీధర్, మంత్రి రోజా మధ్య ముదిరిన రగడ
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మదనపల్లె 2 టౌన్ సీఐ బాధిత తల్లిదండ్రులను పరామర్శించి జరిగిన దాడిపై ఆరా తీశారు. ఇది చూసినా నెటిజన్లు ఆ వ్యక్తిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నో కష్టాలు పడుతూ పెంచి పెద్ద చేసిన అమ్మానాన్నలపై ఇంతా అమానుషంగా ప్రవర్తిస్తారా అని కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ఈవీఎంలపై భయాందోళనలు అనవసరమన్న ఎన్నికల కమిషనర్..
ఇలా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలు చూస్తే.. రక్త సంబంధాల కంటే.. ఆర్థిక సంబంధాలే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. ఆస్తి కోసం కన్నవారిని, తోడబుట్టిన వారిని కనికరం లేకుండా దాడులు చేయడం అవసరం అయితే చంపడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తుంటారు. కానీ, కొందరు బిడ్డలు మానవత్వం మర్చిపోయి..ఆస్తుల కోసం తల్లిదండ్రులపై దారుణాలకు తెగబడుతున్నారు.