Viral Video: సిరిసిల్లలో బంతిలో దూరిన ఎలుక ఏం చేసిందో తెలుసా? వైరల్ గా మారిన ఫన్నీ వీడియో!

సిరిసిల్ల జిల్లాలో ఓ చిట్టి ఎలుక తల బంతిలో ఇరుక్కుపోయింది. బంతి నుండి బయటికి రావడానికి ఆ ఎలుక ముప్పు తిప్పలు పడింది. రోడ్డుపై ఆటు, ఇటు పరిగెడుతూ విలవిలలాడింది. కాగా, అటు వైపు వెళ్తున్న స్ధానికులు ఎలుక వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

New Update
Viral Video: సిరిసిల్లలో బంతిలో దూరిన ఎలుక ఏం చేసిందో తెలుసా? వైరల్ గా మారిన ఫన్నీ వీడియో!

Viral Video: సాధారణంగా ఎలుకలు తిండి కోసం ముప్పు తిప్పలు పడుతుంటాయి. కొన్ని ఎలుకలు ఇళ్లలో చేరి చక్కర్లు కొడితే..మరి కొన్ని ఎలుకలు మాత్రం పంట పొలాల్లోకి వెళ్లి పంటలను నాశనం చేస్తూ ఉంటాయి. అయితే, అలా ఓ చిట్టి ఎలుక తిండి కోసం వెతుకుతూ..పింక్ కలర్ లో ఉన్న చిన్న బంతిని చూసింది. ఆ బంతిని చూసిన ఎలుక అది తినే వస్తువనుకొని తెగ సంతోష పడింది. చూడటానికి భలేగా ఉందే ..ఇంక తింటే ఎంత బాగుంటుందోనని  అత్రంతో ఆ బంతిలోకి తొంగి చూసింది.

ఇంకేముంది, ఆ చిట్టి ఎలుక తల బంతిలో ఇరుక్కు పోయింది. ఇంకా ఆ బంతి నుండి బయటికి రావడానికి ఎలుక నానా తంటాలు పడింది. చిట్టి ఎలుక తల ఆ బంతిలో ఇరుక్కుపోవడంతో ఎటు వెళ్ళాలో తెలియక రోడ్డు పై, ముళ్ళ పొదల్లో ఆటు, ఇటు పరిగెడుతూ విలవిల లాడింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని విద్యా నగర్ లో జరిగింది.

Also Read: ‘ఆస్ట్రేలియా టీమ్‌తో కనెక్ట్ ఐపోయా ..’ జూనియర్‌ ఎన్టీఆర్‌ కామెంట్స్ వైరల్!

అయితే, అటు వైపు వెళ్తున్న స్థానికులు ఆ ఎలుకను చూసి సరదాగా నవ్వుకున్నారే తప్పా.. దానిని త్వరగా బయటకి తీసేందుకు ప్రయత్నించలేదు. అంతేకాకుండా, ఆ ఎలుక పడుతున్న తిప్పలను సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్స్‌ రకరకాలుగా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయ్యో, పాపం చిట్టి ఎలుకకు ఎన్ని కష్టాలు వచ్చాయోనని అని కొందరు..ఎలుక చూడటానికి ఎంత ముద్దుగా ఉందోనని మరికొందరు సెటైర్స్‌ వేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు