Tips: పాదాల నుంచి వచ్చే వాసన పోవడానికి సింపుల్ చిట్కా.. ఆ ఆకులతో ఇలా చేస్తే చాలు

షూస్‌ నిత్యం వేసుకునేవారు అప్పుడప్పుడు వాటి నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతుంటారు. సాక్స్‌లు శుభ్రం చేయకపోయినా.. షూస్‌ను శుభ్రంగా ఉంచుకోకపోయినా విపరీతమైన దుర్వాసన వస్తుంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Tips: పాదాల నుంచి వచ్చే వాసన పోవడానికి సింపుల్ చిట్కా.. ఆ ఆకులతో ఇలా చేస్తే చాలు
New Update

నిత్యం వాడే షూస్‌ను ఒక్కోసారి శుభ్రంగా ఉంచుకున్నా.. పాదాల్లో చెమట కారణంగా ఏర్పడే బ్యాక్టీరియా కారణంగా దుర్వాసన వస్తుంది. చాలా మందికి చెమట ఎక్కువగా పట్టడం వలన పాదాల్లో బ్యాక్టీరియా ఏర్పడుతుంది. దీంతో పాదాల నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. షూస్‌ తీసిన తర్వాత కూడా ఆ వాసన అలాగే ఉంటుంది. అయితే, ఈ దుర్వాసనను తొలగించుకోవడానికి కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు పాటించొచ్చు. ఆ చిట్కాలు పాటించడం ద్వారా షూస్ నుంచి వచ్చే దుర్వాసన తొలగిపోతుంది. మరి ఆ చిట్కాలేంటో ఓసారి చూద్దాం..

దుర్వాసన తగ్గి.. బ్యాక్టీరియా నశిస్తుంది

బ్లాక్‌ టీలో ఉండే ట్యానిక్‌ యాసిడ్స్ దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అలాగే చెమట తక్కువగా ఉత్పత్తి అయ్యేలా కూడా చేస్తుంది. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో రెండు టీ బ్యాగ్స్‌ వేసి కొద్దిసేపు మరిగించాలి. తర్వాత బ్యాగ్స్‌ తీసేసి అందులో ఎక్కువ నీటిని పోసుకోవాలి. కాసేపటి తరువాత అంటే నీరు కాస్త గోరు వెచ్చగా మారిన తరువాత.. ఆ నీటిలో పాదాలను అరగంట పాటు ఉంచాలి. దీంతో పాదాల నుంచి వచ్చే దుర్వాసన తగ్గి.. బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. రాత్రి పడుకునే ముందు పాదాలపై కొన్ని చుక్కల లావెండర్‌ ఆయిల్‌ వేసి సున్నితంగా మసాజ్ చేస్తే పాదాలపై ఉండే బ్యాక్టీరియా నశించి.. దుర్వాసన కూడా తగ్గుతుంది. ఒక బకెట్‌ గోరు వెచ్చని నీటిలో అరకప్పు యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వేసి బాగా కలపాలి. తర్వాత ఆ నీటిలో పాదాలను 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచితే బ్యాక్టీరియా నశించి పాదాల నుంచి దుర్వాసన తగ్గుతుంది.

చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి

షూస్‌ వేసుకునేటప్పుడు పాదాలపై కొద్దిగా మొక్కజొన్న పిండిని చల్లితే చెమట తక్కువగా పడుతుంది. ఒకవేళ వచ్చినా.. చెమటను ఆ పిండి పీల్చుకుంటుంది. తద్వారా పాదాలు రోజంతా పొడిగా ఉంటాయి.కొద్దిగా పుదీనా ఆకులు, చక్కెర, నీరు వేసి ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి పేస్ట్‌లా తయారు చేయాలి. దాన్ని పాదాలకు రాసి తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత కడిగేయాలి. ఇలా నిత్యం చేయడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. దీంతో చెమట తక్కువగా పడుతుంది. బకెట్‌ గోరు వెచ్చని నీటిలో రెండు కప్పుల ఎప్సమ్‌ సాల్ట్‌ కలిపి ఆ నీటిలో పాదాలను 15 నిమిషాలు ఉంచాలి. కొబ్బరినూనెలో లారిక్‌ యాసిడ్‌ ఉంటుంది కాబట్టి ఇది బ్యాక్టీరియాను నాశనం చేసి పాదాల దుర్వాసనను తగ్గిస్తుంది. అంతేకాదు రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెను పాదాలకు రాసుకుని మసాజ్ చేస్తే దుర్వాసన పోయి.. హాయిగా నిద్రపోతారు.

ఇది కూడా చదవండి: దమ్ముగా తల ఎత్తుకునేలా చేశారు: మంత్రి జోగి రమేశ్‌

#shoes #simple-tip #get-rid #foot-odor
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe