Breaking: ఏపీ ఫుడ్ కమిటీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డికి నిరసన సెగ.! కడప జిల్లా మైదుకూరులో ఏపీ ఫుడ్ కమిటీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ప్రతాప్ రెడ్డి కారును అడ్డుకున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. By Jyoshna Sappogula 22 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Breaking: కడప జిల్లా మైదుకూరులో ఏపీ ఫుడ్ కమిటీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. తమ సమస్యలు పరిష్కరించాలని విజయ ప్రతాప్ రెడ్డి కారును అడ్డుకున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఫుడ్ కమిటీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి వారితో మాట్లాడుతూ.. వారి సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే, స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. Your browser does not support the video tag. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చేపట్టిన సమ్మె 11 రోజుకు చేరింది. చాలీచాలని జీతాలతో బతకడం కష్టం గా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెంచకపోయినా సమ్మోను విరమించాలని మంత్రులు అంగన్వాడీలను కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కరం కోసం అంగన్వాడీలు రోజుకో విధానంలో నిరసన తెలుపుతున్నారు. ర్యాలీలు, ధర్నాలు, భిక్షాటన, వంటా వార్పు కార్యక్రమాలతో ఆందోళనలను హోరెత్తిస్తున్నారు. Also read: ఫ్యాన్స్‌లో టెన్షన్.. దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు కోహ్లీ రిటర్న్.. ఎందుకంటే? Your browser does not support the video tag. కనీసం వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని..గ్రాట్యూటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని.. అయితే, మాకు కావలసింది ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా సమస్యలపై రోడ్డెక్కి పది రోజులుగా ఆందోళన చేస్తున్నా మంత్రులు పట్టించుకోకుండా సీఎం బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి