వరుస రైలు ప్రమాద ఘటనలు..కేంద్రం పై విరుచుకుపడ్డ మమతా!

కేంద్ర ప్రభుత్వం అలసత్వం వల్లే దేశంలో ఎక్కువ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎక్స్ పోస్ట్ లో ఆరోపించారు. జార్ఖండ్‌లోని రాజ్‌కర్సవన్  రైలు ప్రమాద ఘటన పై ఆమె విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మమతా తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

New Update
వరుస రైలు ప్రమాద ఘటనలు..కేంద్రం పై విరుచుకుపడ్డ మమతా!

కేంద్ర ప్రభుత్వం అలసత్వం వల్లే దేశంలో ఎక్కువ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. జార్ఖండ్‌లోని రాజ్‌కర్సవన్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన  రైలు ప్రమాదం పై ఆమె విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

దేశంలో వారానికో సారి రైలు ప్రమాదాలు జరుగుతున్నా కేంద్రం నిమ్మకు నీరేత్తినట్టు వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు. దేశంలో నియంత పాలన కొనసాగుతుందని ప్రజలు ప్రయాణాలు చేయాలంటేనే భయపడుతున్నారని ఆమె పేర్కొన్నారు.  దీన్ని ఎంతకాలం సహించగలం? ఈ ప్రభుత్వ దౌర్జన్యానికి అంతం లేదా? ఈ విషయాన్ని మమత తెలిపారు.

Also Read : ఈ సంవత్సరం ఫ్రెండ్‌షిప్ డే ఎప్పుడు? దాని చరిత్ర తెలుసుకోండి!



Advertisment
తాజా కథనాలు