నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడిన రియల్ హీరో!వీడియో వైరల్! జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని సఫాగటల్ ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఏడేళ్ల బాలుడు జీలం నదిలో పడిపోయాడు.దీనిని గమనించిన ఓ వ్యక్తి నదిలో దూకి ఆ బాలుడిని రక్షించాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. By Durga Rao 29 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి జీలం నది ఒడ్డున ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా నదిలో పడిపోవడం, ప్రవాహంలో కొట్టుకుపోవడం చూసి అక్కడున్న కొందరు ఆలోచించకుండా నదిలోకి దూకి బాలుడిని కాపాడారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా చాలా మందికి తెలియని సూపర్‌హీరోలు ఉంటారని ఈ సంఘటన రుజువు చేసింది.దీనికి సంబంధించిన పూర్తి వీడియోను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో దర్శనమిచ్చింది. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని సఫాగటల్ ప్రాంతంలో జీలం నది ఒడ్డున ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఓ ఏడేళ్ల బాలుడు నదిలో పడిపోయాడు.అయితే దీన్ని గమనించిన ఓ వ్యక్తి నదిలో దూకి బాలుడిని ఓడ్డుకు తీసుకువచ్చాడు. నిర్జీవ స్థితిలో ఉన్న ఆ బాలునికి ఆ వ్యక్తి సీపీఆర్ చేసి బ్రతికించాడు.బాలుడు అపస్మారక స్థితిలో ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఈ వీడియో ప్రముఖ ఎక్స్ లో ట్రెండ్ అవుతుంది. మే 16వ తేదీన ఉత్తర కాశ్మీర్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి జీలం నదిలో పడి మృతి చెందాడు. అతని పేరు అబ్దుల్ రహీమ్ లోన్ అని, నీళ్ల కోసం నదికి వెళ్తుండగా కిందపడి చనిపోయాడని తర్వాత వార్తలు వచ్చాయి.మరో సంఘటనలో, కాశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో పడవ బోల్తా పడింది, అక్కడ ఇద్దరు ప్రయాణికులు తప్పిపోయారు.. గల్లంతైన వారిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కావడం గమనార్హం. ఏప్రిల్‌లో కూడా, మొత్తం 26 మంది పిల్లలు పెద్దలతో ప్రయాణిస్తున్న పడవ జీలం నదిలో బోల్తా పడింది, ఏడుగురు మరణించారు ఇంకా చాలా మంది తప్పిపోయారు. ఏప్రిల్ 16న ప్రమాదం జరిగినప్పుడు ఈ పడవలో 15 మంది పాఠశాల విద్యార్థులు కూడా ప్రయాణిస్తున్నారు. జీలం నది మధ్యలో నిర్మాణంలో ఉన్న పైర్‌ను ఢీకొనడంతో పడవ బోల్తా పడిందని పత్రికా కథనాలు చెబుతున్నాయి. #jammu-and-kashmir మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి