Crime News: మత విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యక్తి అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మత విద్వేషాలను రెచ్చగొట్టిన వ్యక్తి అరెస్టు అయ్యాడు. నిందితుడు కైలాష్ గైక్వాడ్ ఉగ్రవాద సంస్థల పేరిట దేవాలయాలకు, మసీదులకు బెదిరింపు లేఖలు రాసినట్లు విచారణలో తేలింది. పలువురి మహిళలకు లేఖలు పంపుతూ మానసిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

New Update
Crime News: మత విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యక్తి అరెస్టు

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సెన్సేషన్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వింత చేష్టలు చేశాడు. ఉగ్రవాద సంస్థల పేరిట దేవాలయాలకు, మసీదులకు బెదిరింపు లేఖలు రాయడం..మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వంటివి చేశాడు. అంతే కాకుండా, మహిళలకు అసభ్యపదజాలంతో కూడిన పోస్టల్ లెటర్లు కూడా రాశేవాడు. దీంతో స్థానిక ప్రజలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం మూడు నెలలుగా గాలింపు చర్యలు చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారులు.

Also Read: వేరే మతస్తుడిని ప్రేమించిందని సొంత చెల్లినే..

ఎట్టకేలకు నిందితుడు కైలాష్ గైక్వాడ్ (53) ను అరెస్ట్ చేశారు. కైలాష్ మణుగూరులోని అశ్వాపురంలో గల హెవీ వాటర్ ప్లాంట్ లో సీనియర్ క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఉగ్రవాద సంస్థల పేరిట పలు హిందూ దేవాలయాలకు, మసీదులకు బెదిరింపు లేఖలు రాసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. నిందితుడిపై మొత్తం ఆరు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పలువురు మహిళలకు తీవ్ర అసభ్యపదజాలంతో కూడిన లెటర్లను పోస్టల్ ద్వారా పంపుతూ మానసిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు.

Also Read: కళ్యాణ్ కన్నింగ్ ప్లాన్..కావ్యను చీరతో కట్టి రాజ్ ఏం చేశాడంటే?

ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మత సామరస్యం నెలకొంటుందని సూచించారు. ప్రజల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే ఎంతటి వారైన సహించేది లేదని తేల్చి చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు