Nizamabad: నిజామాబాద్‌ లో తహశీల్దార్‌ అహంకారానికి ఓ నిండు ప్రాణం బలి..!

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో డిప్యూటీ తహశీల్దార్‌ అహంకారానికి ఓ నిండు ప్రాణం బలైంది. కారు అద్దాలు తుడిచి డబ్బులు అడిగిన యాచకుడు శివరాంను దారుణంగా తన్నాడు తహశీల్దార్ రాజశేఖర్‌. దీంతో అదుపుతప్పి పక్కనే ఉన్న లారీ కింద పడి యాచకుడు మృతి చెందాడు.

New Update
Nizamabad: నిజామాబాద్‌ లో తహశీల్దార్‌ అహంకారానికి ఓ నిండు ప్రాణం బలి..!

Nizamabad: ప్రభుత్వ ఉద్యోగి అహంకారం వల్ల ఓ యువకుడు నిండు ప్రాణాలను కోల్పోయాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆర్మూర్ చౌరస్తా వద్ద శివరాం అనే వ్యక్తి కార్ల అద్దాలను క్లీన్ చేస్తూ యాచిస్తున్నాడు. అయితే, ఈ క్రమంలోనే సిగ్నల్ వద్ద డిప్యూటీ తహసిల్దార్ రాజశేఖర్‌ కారు అద్దాలు తుడిచాడు. ఆ తరువాత శివరాం అతడిని డబ్బులు అడిగాడు.

Also Read: పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నది ఇందుకే: మంత్రి జోగి రమేష్

వెంటనే కారు దిగి అహంకారంతో యాచకుడిని బలంగా తన్నాడు డిప్యూటీ తహసిల్దార్ రాజశేఖర్‌. దీంతో, అదుపుతప్పి పక్కనే ఉన్న లారీ కింద పడి యాచకుడి మృతి చెందాడు. వెంటనే ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయాడు డిప్యూటీ తహశీల్దార్ . అక్కడే ఉన్న స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనపై భువనేశ్వరి దిగ్భ్రాంతి

హుటాహుటినా సంఘటన స్థలంకు చేరుకున్నారు పోలీసు అధికారులు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అవ్వడంతో డిప్యూటీ తహశీల్దార్ రాజశేఖర్‌ సహా లారీ డ్రైవర్ ను అరెస్టు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు