Viral: దంత వైద్యం చేస్తున్న చిలుక.. వీడియో వైలర్!

ఓ చిలుక దంత వైద్యం చేస్తూ జనాలను ఆశ్చర్యపరిచింది. ఓ బాలుడి పుచ్చిపోయిన దంతాన్ని తన నోటితో బయటకు తీసి ఔరా అనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా 'డెంటిస్ట్‌ ప్యారెట్‌' అంటూ ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి.

New Update
Viral: దంత వైద్యం చేస్తున్న చిలుక.. వీడియో వైలర్!

Parrot: చిలుకలు మనుషుల జాతకాలు చెబుతాయని తెలుసు. కొన్ని చిలుకలు మాట్లాడతాయని కూడా తెలుసు. కానీ ఈ రామ చిలుకలు వైద్య వృత్తి కూడా చేయడం ఎప్పుడూ చూసి ఉండరు కదా. అవును ఇది అక్షరాల నిజం. ఇటీవల ఓ రామ చిలుక బాలుడి దంతాలను శుభ్రం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పక్షి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతుండగా ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి.

డెంటిస్ట్‌ ప్యారెట్‌..
ఈ మేరకు డెంటిస్ట్‌ ప్యారెట్‌ బాలుడి నోటిలోని పుచ్చిపోయిన పంటిని (Decayed tooth) బయటకు తీయడం చూసి జనాలు ఫిదా అవుతున్నారు. ఒక వ్యక్తి చిలుకను పట్టుకోగా అది బాలుడి నోటిలో తన నోటిని పెట్టి పుచ్చిపోయిన దంతాన్ని బయటకు తీసింది. ఆ దంతాన్ని ఒక కంటైనర్‌లో ఉంచారు. పాడైపోయిన దంతాలను బయటికి తీసిన ప్యారేట్‌ను చూసి పిల్లవాడు చాలా ముచ్చట పడ్డాడు. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి బాగా నవ్వేశాడు.

ఇది కూడా చదవండి: Work From Jail: జైలు నుంచే కేజ్రీవాల్ సీఎంగా పనిచేయవచ్చా? చట్టాలు ఏం చెబుతున్నాయి?

ఆధునిక దంతవైద్యం..
@bebeginsayfasi ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఈ వీడియో నెట్టింట పోస్ట్ చేయగా.. గంటల వ్యవధిలోనే 13 లక్షల పైగా లైక్స్ వచ్చాయి. ఆధునిక దంతవైద్యం అందుబాటులో లేని రోజుల్లో ప్రజలు ఇలా చిలుకల ద్వారానే సమస్యలను నయం చేసుకున్నారేమో అని ఒక వ్యక్తి సరదాగా వ్యాఖ్యానించారు. మొత్తానికి చిలుకను ‘టాలెంటెడ్ డెంటిస్ట్’ అంటూ పొగిడేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు