Drugs: హైదరాబాద్‌ లో మరోసారి డ్రగ్స్ కలకలం.. అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ అరెస్ట్..!

హైదరాబాద్‌ పంజాగుట్టలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న నైజీరియన్‌ను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ. 8 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 500 మందితో ముఠా ఏర్పాటు చేసి డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Drugs In Hyderabad: పాతబస్తీలో భారీగా డ్రగ్స్ పట్టివేత

Hyderabad: హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. పంజాగుట్టలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి హెరాయిన్‌, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది. పెద్ద మొత్తంలో ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌తో పాటు ఎండీఎఏను సైతం నార్కోటిక్‌ బ్యూరో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: పాన్ ఆధార్ లింక్ చేయనివారి నుంచి ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు 

దేశవ్యాప్తంగా 500 మందితో ముఠా ఏర్పాటు చేసి డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాదులో అమ్ముతున్నారు. హైదరాబాదులో గ్యాంగ్ ఏర్పాటు ఇలా అక్రమాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ నైజీరియన్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల అదుపులో ఉన్న నైజీరియన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్స్‌ ఫెడ్లర్‌గా గుర్తించారు.

Also Read: భువనగిరిలో ఇద్దరు విద్యార్థినుల కేసులో వెలుగులోకి సంచలన నిజాలు

రాష్ట్రంలో మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు హై అలర్ట్ అయ్యారు. పక్కా సమాచారం మేరకు ఎక్కడికక్కడ డ్రగ్స్ ముఠాలను కట్టడి చేసి అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల డ్రగ్స్ కేసులో ఇంజినీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా ఉండటం అందరిని షాక్ కి గురి చేస్తోంది. పార్టీల పేరుతో డ్రగ్స్ తీసుకునే కల్చర్ ను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు