ఇండియాలో లాంఛ్ కానున్నహెచ్‌ఎండీ బ్రాండ్ ఫోన్లు!

ప్రముఖ నోకియా మాతృమూర్తి కంపెనీ అయిన ‘హెచ్‌ఎండీ గ్లోబల్’.. ఇప్పుడు నేరుగా ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి దిగుతోంది. ‘హెచ్‌ఎండీ’ బ్రాండ్ నేమ్‌తో రెండు కొత్త ఫోన్లు ఇండియాలో లాంఛ్ చేయనుంది. ఈ మొబైల్ ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

New Update
ఇండియాలో లాంఛ్ కానున్నహెచ్‌ఎండీ బ్రాండ్ ఫోన్లు!

ఫిన్‌లాండ్‌కు చెందిన హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నోకియాకు బదులుగా సొంత బ్రాండ్‌నేమ్‌ ‘హెచ్ఎండీ క్రెస్ట్ 5జీ(HMD Crest 5G)’, ‘హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ 5జీ (HMD Crest Max 5G)’ పేర్లతో వచ్చే నెలలో రెండు స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేయనుంది.ఈ రెండు మొబైల్స్ యూనిసోక్ టీ760 ఆక్టాకోర్ ప్రాసెసర్ పై పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ యూఐపై రన్ అవుతాయి. రెండు ఫోన్లలో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. రెండు ఫోన్లలో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

హెచ్ఎండీ క్రెస్ట్ మొబైల్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ డెప్త్ సెన్సర్ ఉంటుంది. హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతోపాటు 5 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సర్, 2 ఎంపీ మాక్రో సెన్సర్ ఉంటాయి. రెండు మొబైల్స్‌లో 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. రెండు హెచ్‌ఎండీ మొబైల్స్‌లో 3.5 ఎంఎం ఆడియో జాక్, జీపీఎస్, వైఫై, బ్లూటూత్, 5జీ కనెక్టివిటీ, డ్యుయల్ నానో సిమ్ సపోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లుంటాయి.హెచ్ఎండీ క్రెస్ట్ ఫోన్ (6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ) ధర రూ.12,999గా ఉంది. హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్(8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ) ధర రూ.14,999గా ఉంది. క్రెస్ట్ ఫోన్.. మిడ్ నైట్ బ్లూ, లష్ లిలాక్, రాయల్ పింక్ కలర్ ఆప్షన్లలో, క్రెస్ట్ మ్యాక్స్.. ఆక్వా గ్రీన్, డీప్ పర్పుల్, రాయల్ పింక్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఆగస్టు మొదటి వారంలో సేల్స్ మొదలవుతాయి.

Advertisment
తాజా కథనాలు