Crime News: విషం తాగి బిడ్డకు పాలిచ్చిన తల్లి.. ఏమైదంటే?

నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో హిందూమతి అనే మహిళ విషం తాగింది. ఇంతలోనే తన మూడు నెలల పసికందు గుక్కబెట్టి ఏడుస్తూ కనిపించింది. తల్లి మనసు ఆపుకోలేక ఆ చిన్నారికి వెంటనే పాలు పట్టింది. దీంతో తల్లితో పాటు ఆ చిన్నారి సైతం మృతి చెందింది.

New Update
Crime News: విషం తాగి బిడ్డకు పాలిచ్చిన తల్లి.. ఏమైదంటే?

Kurnool Crime News: ఓ తల్లి తీసుకున్న నిర్ణయం మూడు నెలల చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఆత్మహత్య చేసుకుందామని భావించి విషం తాగిన ఓ మహిళ.. ఏడుస్తున్న తన బిడ్డకు పాలిచ్చింది. దీంతో అక్కడికక్కడే హిందుమతి తోపాటుగా తన బిడ్డ కూడా మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

Also Read: ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం చేయాలి : ముఖేష్ కుమార్ మీనా

సిరివెళ్ల మండలం ఎర్రగుంట్లకు చెందిన ఇందుమతి(26) అనే మహిళ కుటుంబ కలహాలతో విసిగిపోయిన తనువు చాలించాలని భావించింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుందామని భావించింది. ఈ ఉదయం హిందుమతి విషం (కల్లాపి పౌడర్‌) తాగింది. ఇంతలోనే తన మూడు నెలల పసికందు గుక్కబెట్టి ఏడుస్తూ కనిపించింది. దీంతో తల్లి మనసు ఆపుకోలేక ఆ చిన్నారికి వెంటనే పాలు పట్టింది.

Also Read: పావలా శ్యామల ఎమోషనల్ వీడియో..!

అప్పటికే ఇందుమతి శరీరం మొత్తం విషం పాకడంతో.. పాల ద్వారా చిన్నారి శరీరానికి సైతం విషం ఎక్కింది. దీంతో తల్లీబిడ్డలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, కొంతకాలంగా ఇందుమతి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని స్థానికులు అంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు