AP: కడపలో అమానుషం.. కుమార్తె చేతులపై వాతలు పెట్టిన కసాయి తల్లి..!

కడప జిల్లా అహోబిలాపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తండ్రిని చూసేందుకు వెళ్ళిందనే నెపంతో కుమార్తె చేతులపై ఓ కసాయి తల్లి వాతలు పెట్టింది. విషయం తెలుసుకున్న తండ్రి రాముడు కూతురితో కలిసి సింహాద్రిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update
AP: కడపలో అమానుషం.. కుమార్తె చేతులపై వాతలు పెట్టిన కసాయి తల్లి..!

Kadapa: భార్యభర్తలు విడిపోయిన తర్వాత కొంతకాలం బాధ పడినా తర్వాత ఎవరికివారు సంతోషంగా జీవితం కొనసాగిస్తారు. కానీ, పిల్లలకు మాత్రం తల్లిదండ్రులు విడిపోవడం శాపంగా మారుతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ కోసం పిల్లలు ఎంతో ఆరాట పడుతారు. ఆ ప్రేమను పొందకపోవడంతో వాళ్ల మనస్తత్వం భిన్నంగా మారుతుంది. చాలా సందర్భాల్లో మనోవేదన చెందుతారు.

Also Read: తాడేపల్లిలో పేరుపేరునా అభిమానులను పలకరించిన జగన్.. రానున్న కాలంలో..

అయితే, తండ్రి ప్రేమ కోసం ఆరాట పడటమే ఓ కూమార్తె చేసిన తప్పైంది. తనకు దూరంగా ఉంటోన్న తన తండ్రిని చూడాలని అనిపించి ఓ కూతురు తండ్రి దగ్గరకు వెళ్లింది. దీంతో తనకు తెలియకుండా కూతురు తన తండ్రి దగ్గరికి వెళ్లిందని తల్లి వాతలు పెట్టింది. ఈ అమానుష ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read: తాడేపల్లిలో పేరుపేరునా అభిమానులను పలకరించిన జగన్.. రానున్న కాలంలో..

వివరాల్లోకి వెళ్తే.. సింహాద్రిపురం మండలం అహోబిలాపురంలో కొంతకాలం క్రితం రాముడు, సోమేశ్వరమ్మ అనే దంపతులు విభేదాలతో వీడిపోయారు. వీరికి ఇద్దరు కూమార్తెలు. ఇద్దరూ సోమేశ్వరమ్మ వద్దే ఉంటున్నారు. అయితే, తండ్రిని చూడాలనిపించి పెద్ద కుమార్తె తండ్రి వద్దకు వెళ్లింది. ఈ విషయం తల్లి సోమేశ్వరమ్మకు తెలిసింది. తండ్రిని చూసేందుకు వెళ్ళిందనే నెపంతో విచక్షణ మరచి కుమార్తె చేతులపై వాతలు పెట్టింది కసాయి తల్లి. తన బిడ్డకు వాతలు పెట్టిందనే విషయం తెలుసుకున్న తండ్రి రాముడు కూతురితో కలిసి సింహాద్రిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు