పశ్చిమ బెంగాల్లోని హౌరాలో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చాలా భయంకరంగా ఉండటంతో వెంటనే 18 ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. మంటలు తీవ్రంగా ఉండడంతో మంగళహాట్ ప్రాంతం మొత్తం కాలి బూడిదైంది. ఈ మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు 18 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..West Bengal : హౌరాలోని మంగళహాట్లో భారీ అగ్నిప్రమాదం…భయానక వీడియోలు వైరల్..!!
పశ్చిమ బెంగాల్లోని హౌరాలోని మంగళహాట్లో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో పలు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ప్రజలంతా ఇళ్లలో నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. దాదాపు 18 అగ్నిమాపక దళ వాహనాలు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Translate this News: