AP: 25 రోజుల నుంచి నిద్రలేని జీవితం.. విరక్తి చెంది వ్యక్తి ఏం చేశాడంటే? అనకాపల్లి జిల్లా సబరివరం గ్రామానికి చెందిన చేబ్రోలు వెంకటరమణ మూర్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఆరోగ్యం బాగోకపోవడంతో మనస్థాపం చెంది కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకాడు. గమనించిన బీట్ కానిస్టేబుల్ వెంకటరమణను కాపాడి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. By Jyoshna Sappogula 11 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Anakapalli: ఆరోగ్యం బాగోకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, అక్కడే ఉన్న బీట్ కానిస్టేబుల్ వెంటనే అలర్ట్ అయి ఆ వ్యక్తిని కాపాడాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. సబరివరం గ్రామానికి చెందిన చేబ్రోలు వెంకటరమణ మూర్తి ఆరోగ్యం బాగోకపోవడంతో మనస్థాపం చెందాడు. 25 రోజుల నుంచి నిద్రలేని జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించాడు. Also Read: కుప్పంలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ నేతల రాళ్ళ దాడి.! కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకాడు. గమనించిన బీట్ కానిస్టేబుల్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బందితో రెస్కి బోర్డుతో సిబ్బంది ప్రకాష్ బాబూ చాకచక్యంగా వెంకటరమణను కాపాడి ఒడ్డుకి చేర్చాడు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. #anakapalli మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి