కోచింగ్ సెంటర్‎లో భారీ అగ్నిప్రమాదం, ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికిల్లోంచి దూకిన విద్యార్థులు..!!

author-image
By Bhoomi
New Update

ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో ఓ భవనంలో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. ఈ భవనంలో కోచింగ్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. మంటలు చెలరేగిన సమయంలో విద్యార్థులు ఆ భవనంలోనే ఉన్నారు. ఘటనాస్థలానికి 11 ఫైరింజన్లు చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

publive-image

రాజధాని ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. కోచింగ్‌ సెంటర్‌లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొనగా, పలువురు విద్యార్థులు కిటికీల నుంచి కిందకు దూకారు. మంటలను అదుపు చేసేందుకు 11 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు, ముఖర్జీ నగర్‌లోని జ్ఞాన్ భవన్ సమీపంలోని బాత్రా సినిమా కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. అనంతరం 11 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి.

భవనంలో మంటలు చెలరేగడంతో విద్యార్థులు ఒక్కసారిగా పరుగులు తీశారు. పలువురు విద్యార్థులు తాళ్ల సహాయంతో కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. నాలుగు అంతస్తుల భవనంలో ఉన్న కోచింగ్ సెంటర్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని మీటర్ బోర్డులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాణ నష్టం జరిగినట్లు ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు