MakeUp Artist Row: 'టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తా..' ఓయో రూమ్‌లో మేకప్‌ ఆర్టిస్ట్‌పై జూ.ఆర్టిస్ట్‌ అఘాయిత్యం!

టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఓ మేకప్‌ ఆర్టిస్ట్‌ని ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ మోసం చేశాడు. యూసుఫ్‌గూడాలోని ఓయో రూమ్ తీసుకుని వెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు . తర్వాత పెళ్లి చేసుకుంటా అని పలు మార్లు లైంగిక దాడి చేశారు. మరో యువతితో కలిసి దాడి చేసి పలుమార్లు బ్లాక్ మెయిల్ చేశాడు.

MakeUp Artist Row: 'టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తా..' ఓయో రూమ్‌లో మేకప్‌ ఆర్టిస్ట్‌పై జూ.ఆర్టిస్ట్‌ అఘాయిత్యం!
New Update

సినీ రంగంలో అడుగుపెట్టడం ఎంతో మంది కల. అడుగుపెట్టిన తర్వాత తనకంటూ స్టార్‌ ఇమేజ్ రావాలని ఈ ఫీల్డ్‌లోకి వెళ్లే చాలామంది కోరుకుంటారు. మరికొందరు ఇండస్ట్రీలో కెరీర్‌ సెటిల్‌ చేసుకోవాలని భావిస్తారు. పది మంది గుర్తించకున్నా పర్లేదు కానీ.. డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో మైండ్‌సెట్‌. అల్టిమేట్‌గా వెళ్లాలని కోరుకునేది మాత్రం ఫీల్డ్‌లోకే. చిన్న చిన్న ఆర్టిస్ట్‌లగా కెరీర్‌ను ప్రారంభించి.. తర్వాత పెద్ద స్థాయి ఆర్టిస్ట్‌గా ఎదగాలని చాలా మంది కోరుకుంటారు. ఈ క్రమంలో అందివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవాలని అనుకోరు. ఎవరైనా సాయం చేస్తా అంటే వెంటనే నమ్మేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మైండ్‌సెట్‌ ఉన్నవాళ్లనే టార్గెట్ చేసే కామాంధులు ఉంటారు. వారు కూడా బయటవారు కాదు.. ఇండస్ట్రీలో ఉన్నవారే. తాజాగా హైదరాబాద్‌(Hyderabad)లోని యూసుఫ్‌గూడా(Yousufguda)లో జరిగిన ఘటన చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది.

అఘాయిత్యం.. దాడి:

టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ యువతి మీద లైంగిక దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. బస్సులో పరిచయమైన

మేకప్ ఆర్టిస్ట్‌ని జూనియర్ ఆర్టిస్ట్‌ నమ్మించాడు. డెమో కోసం అంటూ యూసుఫ్‌గూడాలోని ఓయో(Oyo) రూమ్ తీసుకుని వెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తర్వాత పెళ్లి చేసుకుంటా అని పలు మార్లు లైంగిక దాడి చేశారు. మరో యువతితో కలిసి దాడి చేసి పలుమార్లు బ్లాక్ మెయిల్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో మధురానగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

రిపీట్‌ అవుతున్న ఘటనలు:

ఇలా సినిమాల్లో ఛాన్స్ ఇస్తామంటూ మభ్యపెట్టి చీటింగ్‌ చేయడం గతంలోనూ అనేక సందర్భాల్లో జరిగింది. గతేడాది(2023) ఇదే జనవరిలో భారీ మోసం వెలుగుచూసింది. 20 ఏళ్ల పాటు మోడల్‌గా ఉంటూ రెండు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ప్రధాన నిందితుడుని అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. మోడలింగ్‌కు పిల్లలను ఎంపిక చేసి ప్రకటనల్లో నటించేందుకు అవకాశం కల్పిస్తారు. ఆన్‌లైన్‌లో కాన్వాస్‌ చేయడం ద్వారా సినీ తారలు, క్రికెటర్లతో నటించే నెపంతో వివిధ నగరాల్లోని మాల్స్‌లో ర్యాంప్ షోలు నిర్వహించేవారు. ఆరు రోజుల పాటు ఫోటో షూట్ చేయబోతున్నామని నిందితులు ఫిర్యాదుదారుడిని నమ్మించి, మొత్తం రూ .14.12 లక్షలను వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేసి, చివరకు తన కుమార్తెను మోడలింగ్‌కు ఎంపిక చేస్తాననే నెపంతో మోసం చేశారని అప్పట్లో బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఇలా సినిమా అవకాశాల పేరిట మోసం చేసే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.

Also Read: నాంపల్లిలో రైలు ప్రమాదం.. 50 మందికి గాయాలు

 WATCH:

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe