Ayodhya : సుమారు 500ఏళ్ల నిరీక్షణ తర్వాత జనవరి 22, 2024న అయోధ్య లోని రామమందిరం(Ram Mandir) లో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు.ప్రస్తుతం దేశమే కాదు యావత్ ప్రపంచం రాముడి నగరం అయోధ్యపై కన్నేసింది. రామ మందిరంతో పాటు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మర్యాద పురుషోత్తమ రాముడి జన్మస్థలమైన అయోధ్య(Ayodhya) లోని నిర్మాణంలో ఉన్న ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న జరగనుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో రామ మందిర నిర్మాణంలో ఏ కంపెనీ ప్రమేయం ఉందో తెలియాల్సి ఉంది.
రికార్డ్ స్థాయిలో ట్రేడ్:
ఈ అయోధ్య రామమందిరాన్ని దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ(L&T) నిర్మిస్తోంది.ఇంతకు ముందు అనేక భవనాలను నిర్మించిన దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ ఇదే. ఢిల్లీలోని లోటస్ టెంపుల్(Lotus Temple), అహ్మదాబాద్ సమీపంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(Statue of Unity) వంటి ప్రాజెక్టులను పూర్తి చేసింది. లార్సెన్ & టూబ్రో సుమారు రూ. 4 లక్షల కోట్ల ఆర్డర్ బుక్‌తో దేశంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ కంపెనీ నిలిచింది. కాగా రామ మందిర నిర్మాణానికి 2020 ఆగస్టు 5న భూమి పూజ నిర్వహించారు.అప్పటి నుంచి ఎల్‌అండ్‌టి కంపెనీ షేర్లు 270 శాతం వరకు రాబడిని ఇచ్చాయి. ఆగస్టు 5, 2020న, L&T షేరు ధర రూ. 934గా ఉంటే.. జనవరి 4, 2024న, షేర్ ధర రూ. 3452 రికార్డు స్థాయిలో ట్రేడయ్యింది.
పెట్టుబడిదారులకు బంపర్ రాబడి:
లార్సెన్ & టూబ్రో షేర్లు ఇప్పటివరకు పెట్టుబడిదారులకు బంపర్ రాబడిని ఇచ్చాయి. ఈ స్టాక్ పై బ్రోకరేజీలు బుల్లిష్‌గా ఉన్నాయి. రానున్న కాలంలో కూడా ఈ కంపెనీ షేర్లు పెట్టుబడిదారులకు ఆదాయాన్ని తెస్తాయని బ్రోకరేజ్ కంపెనీలు భావిస్తున్నాయి. బ్రోకరేజీ సంస్థ నోమురా ఈ షేర్‌ను కొనుగోలు చేయాలని సూచించింది.
టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్లు:
ఇది కాకుండా, ఆలయం లోపల ఇతర ఇంజనీరింగ్ సంబంధిత నిర్మాణాలను నిర్మించడానికి టాటా కన్సల్టెన్సీ(Tata Consultancy) ఇంజనీర్లు, ఆలయ తలుపుల నిర్మాణాన్ని హైదరాబాద్(Hyderabad) కు చెందిన సంస్థ అనురాధ టింబర్స్(Anuradha Timbers) పని చేస్తుంది. రామ మందిరంలో ఉపయోగించే ఇటుకలపై జై శ్రీరామ్ అని రాసి ఉంది. రామ మందిర నిర్మాణానికి రూ.1800 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
(నోట్: పైన పేర్కొన్న సమాచారం పెట్టుబడి సలహా కాదు. మా వెబ్ సైట్ ఎలాంటి పెట్టుబడి సలహాలు ఇవ్వదు. మీ పెట్టుబడులకు మీరే బాధ్యత వహించాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు సర్టిఫైడ్ నిపుణుల సలహా పొండండి.)