Central Govt Jobs: నిరుద్యోగులకు భారీ న్యూ ఇయర్ కానుక.. 27,370 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ . కేంద్ర ప్రభుత్వంలోని పలు సంస్థలు వరుసగా జాబ్ నోటిఫికేషన్లను రిలీజ్ చేశాయి.కొత్త సంవత్సరం కానుకగా 27,370 ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది.

Central Govt Jobs: నిరుద్యోగులకు భారీ న్యూ ఇయర్ కానుక.. 27,370 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
New Update

Central Govt Jobs : దేశంలోని నిరుద్యోగులకు ఇది కచ్చితంగా శుభవార్తలాంటిదే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలోని పలు సంస్థలు 27వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఈ సంస్థలన్నీ కొత్త ఏడాదిలో రిక్రూట్ చేసుకోనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఏయే శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సాయుధ దళాల్లో ఉద్యోగాలు: (SSC GD Constable 2023 )

దేశంలోని కేంద్ర సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగాలను రిక్రూట్ చేసేందుకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) ఈ మధ్యే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా పదవ తరగతి అర్హతతో మొత్తం 26, 146 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో 23వేల మంది పురుషులు ఉంటే 2వేలకు పైగా మహిళ కేటగిరీలో రిక్రూట్ చేయనున్నారు.

ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ : (AI Engineering Services Ltd Recruitment 2024)

ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన 209 ఏఐఈఎస్ఎల్ ఇంజనీరింగ్ యాక్టివిటీ సెంటర్లలో అసిస్టెంట్ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.

ఆదాయపు పన్ను రిక్రూట్‌మెంట్ 2023:(Income Tax Department Recruitment 2024)

ఇన్‌స్పెక్టర్, MTS, ఇతర పోస్టుల కోసం ముంబైలోని ఆదాయపు పన్ను దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్, incometaxmumbai.gov.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 19 జనవరి 2024 వరకు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలో 226 ఉద్యోగాలు: (IB ACIO Recruitment 2024)

న్యూఢిల్లీలోని భారత ప్ఱభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో లో భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన 226 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు జనవరి 12వ తేదీగా అప్లయ్ చేసుకోవల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ కొత్త ఏడాది శుభాకాంక్షలు

#ai-engineering-services-ltd-recruitment-2024 #income-tax-department-recruitment-2024 #ib-acio-recruitment-2024 #central-govt-jobs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe