ఇరాక్‌లోని నినెవే ప్రావిన్స్‌లోని హమ్దానియా జిల్లాలో ఓ వివాహ వేడుకలో భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వందమందికిపైగా మరణించారు. దాదాపు 150 మందికి పైగా గాయపడ్డారు. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్త అప్ డేట్ అవుతోంది...